

వాడిన టీపొడి, కూరగాయల తొక్కలు, దేవుడి వద్ద ఎండిపోయిన పువ్వులు, పండ్ల తొక్కల వంటి కుళ్లే స్వభావం ఉన్న వ్యర్థపదార్థాలను చెత్తబుట్టలో పారెయ్యకుండా.. ఏ పాత డబ్బాలోనో, కుండీలోనో వేయడం... ఆ డబ్బా నిండిన తర్వాత ఏదో ఒక మొక్క పెట్టడం ఆమెకు అలవాటు. అడుగు ఎత్తున్న ధర్మాకోల్ డబ్బాల్లో నారాయణమ్మ కొన్ని మొక్కలు పెంచుతున్నారు. కుమారుడు తన లేబొరేటరీ కోసం తెప్పించే టెస్టింగ్ కిట్లతోపాటు వచ్చే ధర్మాకోల్ డబ్బాలను పారెయ్యకుండా మొక్కలు పెంచడానికి వినియోగిస్తున్నారు.
అంతేకాదు, లాబ్‌కు పరీక్షల కోసం వచ్చే మట్టిని పని పూర్తయ్యాక.. ఒక బస్తాలో జాగ్రత్త చేసి.. ఆ మట్టినే కంపోస్టుతో కలిపి కుండీల్లో వాడుతున్నారు. అద్దె ఇల్లు మొదటి అంతస్థులో ఉంటున్నారు గదా ఇన్ని మొక్కల కుండీలతో ఇబ్బందులేమీ రాలేదా అంటే.. పదేళ్లలో ఎటువంటి ఇబ్బందీ రాలేదని ఆమె నవ్వుతూ చెప్పారు. వేసవిలోనో.. ఏదో ఒక సందర్భంలోనే ఇంట్లో అందరూ ఊరెళ్లాల్సి వస్తే మొక్కల్ని ఎవరు చూస్లారు? ఇరుగు పొరుగు వారు ఎవరో ఒకరు చూస్తారని, అదెప్పుడూ సమస్య అనిపించలేదని చెప్పారు.
No comments:
Post a Comment