
ఈ పట్టికలో పేర్కొన్న విధంగా 12 విభాగాల్లో (కుండీల్లో లేదా మడుల్లోని ఒక్కో చదరపు అడుగు స్థలంలో) సీజన్ల వారీగా ప్రణాళిక ప్రకారం విత్తనాలు వేసుకుంటే... ఇంటిల్లిపాదికీ అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు ఏడాది అంతా అందుబాటులో ఉంటాయి. అందరూ ఇదే వరుసలో వేసుకోవాలనేం లేదు. ఆయా కూరగాయలు, ఆకుకూరలపై ఇష్టాఇష్టాల ప్రకారం ఎవరికి వారు మార్పులు చేసుకోవచ్చు.
ఎండాకాలం: ఆనప, కాకర, బీర, పొట్లకాయ, గుమ్మడి, దొండ, బెండ, దోస, అన్ని రకాల ఆకుకూరలు..
వానాకాలం: అన్ని రకాల ఆకుకూరలు, వంగ, బెండ, గోరుచిక్కుడు, బీర, కాకర..
చలికాలం: బఠాణీలు, చిక్కుడు, టమాటా, క్యాబేజి, క్యాలీఫ్లవర్, ఆలుగడ్డలు, బీన్స్, క్యారట్..
ఎండలో / ఎక్కువ కాంతిలో పెరిగేవి: వంగ, టమాటా, మిరప..
నీడలో పెరిగేవి / నీడను ఇష్టపడేవి: చాలామటుకు ఆకుకూరలు, ఆవాలు, క్యాబేజి, క్యారట్, ముల్లంగి, చిలకడ దుంప మొక్కలు..
నిజానికి.. కొన్ని జాగ్రత్తలు పాటించగలిగితే.. ఇంటిపట్టున ఏ కాలంలోనైనా ఏ పంటలైనా సాగుచేసుకోవడానికి పెద్ద అడ్డంకులేమీ ఉండవు. అయితే.. పంటల సహజ స్వభావానికి విరుద్ధంగా ఆయా పంటల.. అననుకూల వాతావరణంలో పంటలు పండించాలంటే.. ఆయా పంటల ప్రత్యేక లక్షణాలు గ్రహించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. క్యారట్, క్యాబేజీ వంటి పంటలు సాధారణంగా చలికాలంలో/ శీతాకాలంలో చక్కగా పెరుగుతాయి. అధిక ఉష్ణాన్ని తట్టుకోలేకపోవడం వీటి సహజ లక్షణం. ఈ రెండు పంటలు చలికాలం పోయాక సాగు ప్రారంభిస్తే.. దిగుబడి అసలు రాకపోవచ్చు. మిగతా పంటలేవైనా ఏ కాలంలోనైనా విత్తుకోవచ్చు. అయితే, వాటికి బాగా అనుకూలంగా ఉన్న సీజన్లో దిగుబడి బాగా వస్తుంది. అననుకూల కాలంలో దిగుబడి ఓ మోస్తరుగా వస్తుంది. అంతే తేడా!
ఆకుకూరలు నెల రోజుల్లో కోతకు వస్తాయి. రెండు నెలలపాటు దిగుబడినిస్తాయి. బెండ విత్తిన నెలకు కాపుకొస్తుంది. 3 నెలలు కాస్తుంది. మిగతా కూరగాయ మొక్కలు దాదాపు 2 నెలలకు కాపుకొస్తాయి. 2 నెలలపాటు దిగుబడినిస్తాయి. మిరప మొక్కలు రెండు (రెండు నెలలకోసారి) వేసుకుంటే కుటుంబానికి సరిపోతాయి. కొత్తిమీర, పుదీన కుండీలు / మడుల అంచుల్లో చల్లుకుంటే సరిపోతాయి. ఎండాకాలంలో, ముఖ్యంగా టెరస్ల్రపై, కూరగాయల మొక్కలు పెంచాలనుకుంటే షేడ్‌నెట్‌తో ఎండ నుంచి రక్షణ కల్పించాలి. సెల్ఫ్ వాటరింగ్ పాట్స్‌ను/ మడులను ఏర్పాటుచేసుకోవచ్చు.
- సాక్షి స్పెషల్ డెస్క్
సందేహాలున్నాయా?
‘ఇంటి పంట’ పాఠకుల సందేహాలకు, సమస్యలకు సమాధానాలివ్వడానికి నిపుణులు నిత్యం అందుబాటులో ఉంటారు.
సికింద్రాబాద్ తార్నాకలోని సుస్థిర వ్యవసాయ కేంద్రం కార్యాలయంలో 040- 27014302 / 27017735 ఫోన్లలో నిపుణులు నిత్యం అందుబాటులో ఉంటారు. అన్ని పనిదినాల్లో సాయంత్రం 3 గం. నుంచి 6 గం. వరకూ ఫోన్ చేయవచ్చు.
హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని అగ్రి. హార్టికల్చరల్ సొసైటీ అధ్యక్షులు మిద్దెల అనంతరెడ్డిని 92461 08262 నంబరులో మధ్యాహ్నం 2 గం. నుంచి 4 గం. వరకూ సంప్రదించవచ్చు.
intipanta@googlegroups.com
‘ఇంటిపంట’ పాఠకులు సుస్థిర వ్యవసాయ కేంద్రం, అగ్రి. హార్టికల్చరల్ సొసైటీకి చెందిన నిపుణులను సంప్రదించడం కోసం ఇకపై గూగుల్‌గ్రూప్స్.కామ్‌ను వినియోగించుకోవచ్చు. ఇంటిపంటల సాగులో తమ అనుభవాలను ఇతరులతో పంచుకోవాలనుకునే వారు కూడా ఈ గ్రూప్ మెయిల్‌ను వినియోగించుకోవచ్చు.
intipanta@googlegroups.comకు మెయిల్ పంపితే చాలు ఈ గ్రూప్‌లో సభ్యులైపోవచ్చు. సభ్యుల్లో ఎవరు మరెవరికి మెయిల్ ఇచ్చినా.. దాని కాపీ ఆటోమేటిక్‌గా అందరికీ వస్తుంది. ఎవరైనా ఒక ప్రశ్నను నిపుణులను అడిగి సమాధానం పొందితే.. అది వారితో పాటు గ్రూప్‌లో సభ్యులందరికీ కూడా తెలుస్తుందన్న మాట!
కథనాలన్నీ ఒకేచోట..!
ఇంటి పంట
‘ఇంటి పంట’ శీర్షికలో కొన్ని వారాలుగా ప్రచురితమవుతున్న కథనాలన్నీ ఎక్కడ అందుబాటులో ఉంటాయి? అని కొందరు పాఠకులు అడుగుతున్నారు. వారి కోరిక మేరకు పాత కథనాలన్నిటినీ అందుబాటులో ఉంచాం. ఠీఠీఠీ.ట్చజుటజిజీ.ఛిౌఝ హోమ్ పేజీలో కుడి వైపున ఉన్న ‘ఇంటి పంట’ ఐకాన్‌ను క్లిక్ చేస్తే ఇంటి పంట కథనాలు కనిపిస్తాయి.
ఠీఠీఠీ.ట్చజుటజిజీ.ఛిౌఝ
ReplyDeleteCant find this please provide the website name In english please..