Monday, 21 March 2011

వంటింటి వ్యర్థాలతో కంపోస్టు


కంపోస్టు ఎలా? అన్న ప్రశ్న ‘ఇంటి పంట’కు ఉపక్రమించిన వారిని ఇబ్బందిపెడుతోంది. సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది! కంపోస్టును ఎక్కడికో వెళ్లి ప్రతిసారీ కొనుక్కోవడం ఎందుకు? మనమే.. మన ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు!!
ఎట్లా అంటారా..? వెరీ సింపుల్!
వంటింట్లో చెత్తబుట్టలోకి చేరుతున్న వ్యర్థ పదార్థాలతోనే.. ‘నల్ల బంగారం’ తయారుచేసుకోవచ్చు!!
కూరగాయ తొక్కలు, పండ్ల తొక్కలు, ఆకుకూర వ్యర్థాలు.. అంతెందుకు మిగిలిపోయిన అన్నం, కూరలు... ఇంకా చెప్పాలంటే కుళ్లే స్వభావం ఉన్న ఏదైనా... కంపోస్టు తయారీకి వాడొచ్చు. రోజూ వంటింటి వ్యర్థాలను ఇంటి బయట ఒక మట్టి పాత్ర (కంపోస్టర్)లో వేస్తే 90 రోజుల్లో చక్కటి కంపోస్టు తయారవుతుంది.

పర్యావరణానికీ ఎంతో మేలు!
దీని వల్ల ‘ఇంటి పంట’కు ఇంటిపట్టునే చక్కటి సేంద్రియ ఎరువు తయారవ్వడమే కాదు.. మున్సిపాలిటీ వాళ్లకు తలనొప్పిగా, భారంగా మారిన చెత్త సమస్యకు మీ అంతట మీరే చక్కటి పరిష్కారం చూపుతున్నారన్నమాట. నలుగురూ ఈ విధంగా వంటింటి వ్యర్థాలను చెత్తబుట్టలో పడెయ్యకపోతే.. పర్యావరణానికీ ఎంతో మేలు జరుగుతుంది!

నిజమేనండీ..!! మున్సిపాలిటీ వాళ్లు చెత్తనంతా ఊరుబయట డంపింగ్ యార్డుల్లో కుమ్మరిస్తున్నారు. ఈ యార్డులు దుర్గంధం ముక్కుపుటాలను అదరగొట్టడంతో పాటు పర్యావరణానికి హాని చేస్తున్నాయి! అంటే.. వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారుచేసే వారంతా పర్యావరణానికి మేలు చేస్తున్నట్లేనన్నమాట.

దుర్గంధం రాదు..!
అసలే ఇరుకు ఇళ్లు.. ఖాళీ స్తలాలుండే పల్లెల్లో చేయొచ్చు గానీ... ఇక్కడెక్కడ కంపోస్టు తయారుచేస్తాం? అన్న సందేహం మహానగరవాసులకూ అక్కర్లేదు. ఎందుకంటే.. పద్ధతి ప్రకారం కంపోస్టు చేస్తే.. వ్యర్థాలు మురిగే పరిస్థితి ఉండదు కాబట్టి.. దుర్వాసన రాదు. మట్టితో ప్రత్యేకంగా తయారుచేసిన పాత్ర (టెరక్రోట కంపోస్టర్)ను వాడి సులువుగా కంపోస్టును తయారుచేసుకోవచ్చు.

కంపోస్టర్‌ను ఉపయోగించేది ఇలా..

కంపోస్టర్ ద్వారా ఏరోబిక్ (ఆక్సిజన్ విరివిగా సోకే) పద్ధతిలో కంపోస్టు తయారవుతుంది. నిలువుగా ఒకదానిపై మరొకటి.. మూడు కుండలు పేర్చినట్టు ఉంటుంది.. కంపోస్టర్. వంటింటి వ్యర్థాలు (ప్లాస్టిక్ వ్యర్థాలను వేరుచేసి పారేయాలి) మొదట పైన కుండలో వేస్తుండాలి. నలుగురు సభ్యులున్న కుటుంబంలో వంటింటి నుంచి రోజుకు ముప్పావు కిలో నుంచి కిలో వరకూ తడి చెత్త వస్తుందని అంచనా. ఆ చెత్తతో 20 రోజుల్లో పైకుండ నిండుతుంది.

ఆ కుండను మధ్యలోకి మార్చి.. మధ్యలో కుండను పైకి పెట్టాలి. అదీ నిండాక... ఆ చెత్తను మధ్యలోని కుండలో పోయాలి. అదీ నిండాక అట్టడుగున ఉన్న కుండలోకి పోయాలి. ఇలా.. చేస్తే 3 నెలల్లో చక్కటి కంపోస్టు తయారవుతుంది. వ్యర్థ పదార్థాలతో.. నాణ్యమైన సేంద్రియ ఎరువు తయారైందన్న మాట. కంపోస్టు చక్కటి మట్టి వాసన వస్తుంది. ఇంతకన్నా పుష్కలంగా పోషకాలన్నీ ఉన్న సహజ ఎరువు మరేమీ ఉండదు!
-‘సాక్షి’ స్పెషల్ డెస్క్

మామూలు కుండలతోనూ కంపోస్టర్!
టెరక్రోట కంపోస్టర్లు అందుబాటులో లేనిచోట మామూలు కుండలతోనే కంపోస్టర్‌ను తయారుచేసుకోవచ్చు. 3 కుండలు తీసుకోండి... కార్పెంటర్ వద్ద డ్రిల్లింగ్ మిషన్‌తో మూడు కుండలకూ నాలుగు దిక్కులా (గాలి ఆడడం కోసం) నెమ్మదిగా చిన్నచిన్న బెజ్జాలు పెట్టించండి.

పైన పెట్టే రెండు కుండలకు.. అడుగున కూడా ఒక బెజ్జం పెట్టించండి. వ్యర్థాలలో ఉండే తడి ఊట ఏదైనా ఉంటే కిందికి దిగడానికే ఈ బెజ్జం. అట్టడుగున పెట్టే కుండకు అడుగున బెజ్జం అక్కర్లేదు. అంతే! కంపోస్టర్ సిద్ధం!! మరిన్ని వివరాల కోసం ఠీఠీఠీ.ఛ్చీజీడఛీఠఝఞ.ౌటజ/ sites/default/pdf/instruction3matka-web.pdf వెబ్ పేజీని చూడొచ్చు. అదనపు వివరాలకు 099164 26661(బెంగళూరు)కు ఫోన్ చేయొచ్చు.

తడి చెత్త.. పొడి చెత్త కలిపి వేయాలి!
వంటింటి వ్యర్థాలను కంపోస్టర్‌లో వేయడానికి రోజుకు 5 నిముషాలకన్నా పట్టదని ‘హైదరాబాద్ గోస్ గ్రీన్’ సంస్థకు చెందిన అభినవ్ గంగమళ్ల (74167 90905), హుదా మసూద్ అన్నారు. టెరక్రోట కంపోస్టర్లను వీరు గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి తెచ్చారు. తడి వ్యర్థాలను కంపోస్టర్‌లో వేసిన ప్రతిసారీ.. గుప్పెడు ఎండు ఆకులో లేదా రంపపు పొట్టో వేయాలి. ఇవి దొరక్కపోతే.. పాత న్యూస్ పేపర్‌ను సన్నటి పీలికలుగా చింపి కూడా వేయొచ్చు. తడి, పొడి వ్యర్థాలను వేసినప్పుడల్లా కలియతిప్పడం మరువరాదన్నారు.

సేంద్రియం వైపు.. జనం చూపు



రసాయనిక పురుగుమందుల అవశేషాలతో ఆహారం కలుషితమై ఆరోగ్యాన్ని హరిస్తున్న నేపథ్యంలో.. ఈ విషయాలు కాస్త తెలిసిన వారు పురుగుమందులు, రసాయనిక ఎరువులు వాడకుండా పెంచిన సేంద్రియ ఆహారోత్పత్తుల వైపు మళ్లుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సైతం సేంద్రియ ఆహారోత్పత్తుల వినియోగం ఏటా 20-25 శాతం మేరకు పెరుగుతోంది. మన దేశంలో కూడా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో సేంద్రియ ఆహారోత్పత్తుల వాడకం అంతకంతకూ పెరుగుతోంది. స్పెన్సర్స్ లాంటి పలు సూపర్ మార్కెట్లలో సేంద్రియ కూరగాయల కొనగోళ్లు ఇటీవల పెరుగుతున్నాయి. వీటి ధర మామూలు వాటికన్నా ఎక్కువే అయినా.. తర్వాత వచ్చే పరిణామాలకు రోగాలకు తగలేసేదానికన్నా తక్కువే కదా అని వీరి అభిప్రాయం.
ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆరోగ్యదాయకమైన ఆహారం, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య రహిత పరిసరాలపై చైతన్యం క్రమంగా పెరుగుతోంది. ఈ చైతన్యమే సేంద్రియ సేద్యంపై మక్కువ పెంచుతోంది. తాము పండించుకున్న ఆహారాన్నే తినాలన్న భావన, గ్రామీణాభివృద్ధి, ప్రకృతి పరిరక్షణ భావన సేంద్రియ సేద్యం విస్తరించడానికి దోహద పడుతోంది. సహజ సేద్యం భారతీయులకు అనాదిగా అలవాటైనదే. అయితే, వలస పాలనలో దేశీయ సాగు పద్ధతులు ధ్వంసమై వ్యవసాయ రంగం అస్తవ్యస్తమైంది. ఆ నేపధ్యంలో 1960వ దశకంలో రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం ఉధృతంగా ప్రారంభమైన తర్వాత దిగుబడి పెరిగినా... క్రమంగా సమస్యలు ముప్పిరిగొని సంక్షోభానికి దారితీశాయి. రసాయనిక సేద్యం వల్ల వ్యవసాయోత్పత్తుల్లో పోషకాలు లోపించడం, రుచి తగ్గడం, పర్యావరణంపై ముఖ్యంగా నేలకు, పర్యావరణానికి తీరని హాని వాటిల్లుతుండడం వ్యవసాయ రంగంలో పెను సంక్షోభాలకు దారితీసింది.

ఈ విపరిణామాల నేపథ్యంలో ఇటీవలి సంవత్సరాల్లో మన దేశంలో కూడా సేంద్రియ సేద్యంపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించడం ప్రారంభించాయి. ఉత్తరాంచల్, సిక్కిం, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాలు సేంద్రియ సేద్యాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకున్నాయి. కర్నాటక, తమిళనాడు, కేరళ, బీహార్ సహా 11 రాష్ట్రాలు సేంద్రియ సేద్యం ప్రాధాన్యం గుర్తెరిగి స్పష్టమైన విధానాలను ప్రకటించాయి. రసాయనిక పురుగు మందులు, ఎరువులు వాడే అలవాటు తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో సేంద్రియ సేద్యాన్ని పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తున్నాయి. మన రాష్ట్రం సేంద్రియ సాగు విధానం ముసాయిదా మాత్రం ప్రకటించింది.

సేంద్రియ కూరగాయలు, పండ్ల వల్ల ఉపయోగాలు..

సూపర్ మార్కెట్లో రకరకాల ఉత్పత్తులు కనిపిస్తాయి.. ‘పిల్లలకు ప్రోటీన్లు, విటమిన్లు అందిస్తాయి, మా ఉత్పత్తుల్లో ఐరన్ పుష్కలంగా ఉంది.. మీ పిల్లలు బాగా పెరుగుతారని...’ ప్రకటనలు చూసి వందలు పోసి కొంటాం. కానీ, సేంద్రియ పద్ధతుల్లో పెంచిన కూరగాయలు, పండ్లలోనే ఇవి పుష్కలంగా ఉంటాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందులతో పెంచిన ఉత్పత్తుల్లో 87 శాతం పోషకాలే ఉంటాయని ఒక అంచనా. సేంద్రియ పద్ధతుల్లో పెంచిన ఉత్పత్తుల్లో పోషకాలు పుష్కలం. రసాయనిక ఎరువులతో పెరిగిన కూరగాయలతో పోలిస్తే సేంద్రియ కూరగాయల్లో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. ఇక రుచి సంగతి చెప్పన క్కర్లేదు. రసాయనాల అవశేషాలు ఉండవు కనుక రోగాలు అంటవు.

ఎందుకు ఇవి ఎక్కువగా దొరకవు?

ప్రభుత్వం రసాయనిక ఎరువులు, పురుగుమందులతో చేసే సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నంతగా సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహించడం లేదు. ప్రభుత్వ ప్రాధాన్య రంగాల్లో సేంద్రియ సేద్యం లేదు! ఎకరానికి సరిపోయే రసాయనిక ఎరువులపై యూరియా, డీఏపీలపై ప్రభుత్వం కనీసం రూ.3 వేల సబ్సిడీ ఇస్తుంది. కానీ కంపోస్టుతో సేంద్రియ సేద్యం చేసే రైతుకు నేరుగా ఇస్తున్నదేమీ లేదు. సేంద్రియ సాగులో వ్యక్తిగత శ్రద్ధ మరింత అవసరం. రైతుకు శ్రమ కొంచెం ఎక్కువే. అయినా సేంద్రియ సేద్యంతో ఆరోగ్యదాయకమైన సహజాహారం పండించేందుకు కొందరు రైతులు కృషి చేస్తున్నారు. నిజానికి ఇక్కడే ఎగుమతుల మార్కెట్ మనకు లాభిస్తోంది.. అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో లేబర్ కాస్ట్ ఎక్కువ కనుక సేంద్రియ ఉత్పత్తుల కోసం వారు భారత్ వంటి దేశాలపై ఆధారపడుతున్నారు. పంట పండించాక నిల్వ ఉంచడానికి రసాయనాలు వాడకుండా ఉండాలంటే ప్రాసెసింగ్, రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉండాలి. మార్కెట్‌కు వెంటనే చేరేసే వ్యవస్థ ఉండాలి. సేంద్రియ సాగులో తొలినాళ్లలో దిగుబడి కొంతమేరకు తక్కువగా ఉంటుంది కనుక రైతుకు వాణిజ్య పరంగా గిట్టుబాటు కావాలంటే.. ప్రభుత్వం ఇటువంటి రైతులకు వెన్నుదన్నుగా నిలవాలి. రసాయనిక ఎరువులపై రాయితీ ఇస్తున్న ప్రభుత్వం.. సేంద్రియ ఎరువులు, సహజ ఔషధాల తయారీ, కొనుగోలుకు నేరుగా ప్రోత్సాహకాలను అందజేస్తే మేలు జరుగుతుంది.

మరి ఇంతేనా..

దేశవ్యాప్తంగా సేంద్రియ పంటల సాగు పెరుగుతోంది. ప్రధాన కారణం... ఎగుమతులు పెరగడం. అమెరికా, జపాన్, యూరప్ దేశాల్లో సేంద్రియ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. దీనితో పాటు ఎగుమతులపై దృష్టి పెట్టిన హైదరాబాద్‌లోని ‘శ్రేష్ట’ వంటి కొన్ని ప్రైవేటు సంస్థలు రైతులను ప్రోత్సహించి.. వారికి సదుపాయాలు కల్పించి సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయిస్తున్నాయి. వీటి ఎగుమతుల మార్కెట్ ఏటా 13 శాతం పెరుగు తోంది. ప్రస్తుతం 50 బిలియన్ డాలర్లున్న ఈ మార్కెట్ 2014 కల్లా 96.5 బిలియన్ డాలర్లు దాటుతుందని అంచనా. దీనిలో అమెరికా వాటా 49 శాతం. ప్రాసెస్డ్ ఫుడ్ మినహాయిస్తే... కూరగాయలు, పండ్లదే 36 శాతం ఉంటుంది. అంటే మనకు కావల్సినంత గిరాకీ.

సేంద్రియ రైతుకు రాబడి ఎక్కువ

ఇక్కడో ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే... రసాయనిక ఎరువులతో పండిన పంట దిగుబడులపై కన్నా సేంద్రియ ఆహారోత్పత్తులపై రైతులకు 30-40 శాతం ఎక్కువ రేటు వస్తుంది. మన దేశంలో కూడా (ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో) ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం, రసాయనాల అవశేషాల వల్ల ఆరోగ్యపరంగా కలిగే హాని గురించి అవగాహన పెరుగు తుండడంతో సేంద్రియ ఆహారోత్పత్తుల వాడకం ఊపందుకుంది, హైదరా బాద్ లాంటి నగరాల్లో వీటి వాడకం గణనీయంగా పెరిగింది. విడి గా సేంద్రియ మార్కెట్‌లు ఉండడమే కాదు.. కొన్ని రైతు బజార్లలో దాదాపు అన్ని పెద్ద సూపర్ మార్కెట్లలో ఈ కూరగాయలు దొరుకుతున్నాయి.

సేంద్రియ ఆహారంపై పెరుగుతున్న చైతన్యం

సేంద్రియ సాగు ద్వారా ఉత్పత్తయ్యే సహజాహారం చేసే మేలు గురించి అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో చైతన్యం తేవడానికి కృషిచేస్తున్నాయి. హైదరాబాద్ వంటి నగరాలలో ఇటువంటి ప్రకృతి ఆహారం స్టాళ్లు పెరుగు తున్నాయి. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఒకే చోట నాలుగు స్టాళ్లు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు పెరుగుతున్నాయని ఒక స్టాల్ యజమాని రంగారావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. గోధుమ గడ్డి, ముడి బియ్యం, కొరల్రు, జొన్న రవ్వ, రాగి పిండి అమ్మకాలు పెరిగినట్లు ఆయన వివరించారు. ఈ షాపుల్లో అన్ని రకాల తృణధాన్యాలు లభిస్తున్నాయి. సుస్థిర వ్యవసాయ కేంద్రం(సీఎస్‌ఏ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తార్నాకలో ‘సహజాహారం’ పేరిట సేంద్రియ ఆహారోత్పత్తులు విక్రయిం చే స్టాల్ ఏర్పాటైంది. బియ్యం, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు విక్రయిస్తున్నారు. డోర్ డెలివరీ సదుపాయం కూడా కల్పించారు. సేంద్రి య కూరగాయలను హైదరాబాద్‌లోని రెండు ప్రాంతాల్లో వ్యాన్‌లో తీసుకెళ్లి బుధ, శనివారాల్లో విక్రయిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాలకు దశలవారీగా విస్తరించనున్నారు. తృణధాన్యాల సాగును మెదక్ తదితర జిల్లాల్లో ప్రోత్సహిస్తున్న దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో సేంద్రియ తృణధాన్యాలను అందు బాటులోకి తెస్తోంది.

బియ్యం, గోధుమల్లోకన్నా కనీసం పది శాతం అధిక పోషకాలు తృణధాన్యాల్లో ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. పూర్తిగా తృణ ధాన్యాలనే ఆహారంగా తీసుకుంటే సుగర్ వంటి వ్యాధులు బాధించని స్థాయికి తగ్గిపోయాయని కొందరు వైద్యులు చెప్తున్నారు. హైదరాబాద్ లోని సచివాలయం వద్ద మాజీ మంత్రి ముత్యంరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్‌లో సేంద్రియ బియ్యం, కూరగాయలను అనుదినం సాయంత్రపు వేళల్లో విక్రయిస్తున్నారు. ఈ స్టాల్‌కు అమిత ప్రజాదరణ లభిస్తున్నది. ఇక కేంద్ర ప్రభుత్వం పదో పంచవర్ష ప్రణాళికలో దీని కోసం వంద కోట్లు కేటాయించింది. పదకొండవ పంచవర్ష ప్రణాళికలో ఇంకా బాగా దృష్టి పెడతామంటోంది.
పంతంగి రాంబాబు, ‘సాక్షి’ స్పెషల్ డెస్క్


సేంద్రియ సాగుపై ఏదీ పరిశోధన?

వ్యవసాయ పరిశోధనలకు ప్రభుత్వం ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తూ సేంద్రియ సేద్యాన్ని పట్టించుకోకపోవడం సరికాదు. మా వంటి రైతులు సేంద్రియ సాగులో ఎంత అధిక దిగుబడులు సాధించి ఎన్ని అవార్డులు సంపాయించినా.. ఎంత చేసినా మాకు లాబ్ లేదు కాబట్టి నాన్ టెక్నికలే..! ప్రపంచం అంతా గుర్తిస్తున్న సేంద్రియ సేద్యంపై ఇప్పటికీ పరిశోధనా కేంద్రం ఒక్కటీ లేదంటే ప్రభుత్వ ప్రోత్సాహం ఏ మేర ఉందో అర్థం చేసుకోవచ్చు. సేంద్రియ రైతులకూ ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి. పరిశోధన జరిగి ఉంటే ‘సెర్ప్’ ఆధ్వర్యంలో జరుగుతున్న సేంద్రియ సాగు మరింత నిర్మాణాత్మకంగా, ఆచరణాత్మకంగా ఉండడానికి వీలయ్యేది.
గుడివాడ నాగరత్నం నాయుడు,
సేంద్రియ రైతు, తారామతిపేట, రంగారెడ్డి జిల్లా

సేంద్రియ సాగు విధానం ప్రకటించాలి

రాష్ట్ర ప్రభుత్వం 2008లో సేంద్రియ వ్యవ సాయ విధానంపై ముసాయిదా పత్రాన్ని వెలు వరించింది. అయితే దానిపై ఇంత వరకు చర్చ లేదు. సేంద్రియ సేద్యం చేస్తున్న రైతులు బయట కొనే ముడిసరుకులకే కాకుండా తాము స్వయంగా తయారుచేసుకున్న సేంద్రియ ఎరువులు, ఔషధా లకు కూడా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించాలి. సహజ ఆహారంపై ప్రజల్లో చైతన్యం పెరుగు తోంది. రైతు సహకార సంఘాల తరఫున హైదరాబాద్‌లోని తార్నాకలో ఏర్పాటు చేసిన ‘సహజాహారం’ స్టాల్‌కు మంచి స్పందన లభిస్తోంది. రాష్ర్టవ్యాప్తంగా సేంద్రియ రైతు సహకార సంఘాలు ఉన్నాయి. తమ సంస్థ ఆధ్వర్యంలో విశాఖ, కరీంనగర్, నల్లగొండ, కర్నూలు, అనంతపురం, వరంగల్ జిల్లాలలోని 130 గ్రామాలలో సేంద్రియ పద్ధతుల్లో సాగు జరుగుతుంది.
డాక్టర్ జీవీ రామాంజనేయులు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్
సుస్థిర వ్యవసాయ కేంద్రం(సీఎస్‌ఏ) హైదరాబాద్

దిగుబడి తగ్గినా ఆదాయం తగ్గదు!

సేంద్రియ సాగు ప్రారంభించే రైతులకు నేల సారం మెరు గయ్యే వరకూ ఒకటి రెండేళ్లపాటు రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడినప్పుడు వచ్చిన దిగుబడిలో 60 శాతం వస్తుంది. 3, 4 ఏళ్ల తర్వాత 90 నుంచి 95 శాతం దిగుబడి వస్తుంది. సేంద్రియ దిగుబడులకు అధిక ధర వస్తుంది కాబట్టి, రైతుకు లాభం ఇంచు మించు అదేస్థాయిలో నికరాదాయం వస్తుంది. కనీసం పిల్లలకైనా సేంద్రియ ఆహారం అందిస్తే రాబోయే తరం బాగుంటుంది. రైతులందర్నీ సేంద్రియ సేద్యం చేయమంటే ఆహార లభ్యత తగ్గి పోయే ప్రమాదముంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో సేంద్రియ సాగును ప్రభుత్వం ప్రోత్సహించాలి.
డాక్టర్ బాబూ రతన్, సీనియర్ శాస్తవ్రేత్త , ఉద్యాన కళాశాల పరిశోధనా కేంద్రం, అనంతరాజు పేట, వైఎస్సార్ జిల్లా


‘ఇంటి పంట’ వ్యాప్తికి ‘సాక్షి’ యజ్ఞం

కూరగాయలు, ఆకుకూరల్లోకి విషం ఎట్లా చేరుతున్నదో తెలుసుకున్నాం కదా.. రసాయనాల బెడద తప్పించుకోవాలం టే సేంద్రియ సాగు పద్ధతులే దిక్కు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశించి లాభం లేదు. పల్లెల్లో ఉండేవాళ్లే కాదు.. పట్నాల్లో.. నగరాల్లో కాపురం ఉంటున్న వాళ్లూ... ఎవరి ఇంటి దగ్గర వాళ్లు ఆరోగ్యదాయకంగా కూరగాయలు, ఆకుకూరలు పండించుకో వచ్చు. ఇదంతా కష్టం అనుకునేరు సుమా..! ఆరోగ్యమే మహా భాగ్యం కదా...! చాలా సులువుగా, శ్రమ లేకుండా మీ ఇంటి దగ్గర ఉన్న జాగాలోనే వీలైనన్ని మొక్కలు వేయండి. ఇంటి ముందో వెనకో ఖాళీ జాగా ఉంటే సరేసరి.

అంతగా స్థలం లేక పోయినా.. మేడ మీదైనా కూరగాయలు, ఆకుకూరలు ఎంచక్కా ఏడాది పొడవునా పెంచుకునే భేషైన మార్గాలున్నాయి. ఈ మహా ఆరోగ్య రక్షణ యజ్ఞంలో ‘సాక్షి’ మీకు తోడుంటుంది. నిపుణుల సలహాలు అడుగుదాం. ఇప్పటికే ఈ యజ్ఞం చేస్తున్న అదృష్టవం తుల్ని అడిగి వారి అనుభవాలు తెలుసుకుందాం. అనుభవాలు పంచుకుందాం. ఈ సదాశయంతోనే ‘ఇంటి పంట’ శీర్షికను మీ కోసం ‘సాక్షి’ ప్రారంభిస్తోంది. ప్రతి శుక్ర, శనివారాల్లో మీ నియోజకవర్గ పులవుట్ 3వ పేజీలో.. ‘ఇంటి పంట’ మిమ్మల్ని పలకరిస్తూ ఉంటుంది. కిచెన్ గార్డెన్ పెంచుకోవడానికి మరి మీరూ సిద్ధమవుతున్నారు కదూ...!
 ‘సాక్షి’ స్పెషల్ డెస్క్

సీజన్ల వారీగా ప్రణాళిక ప్రకారం విత్తనాలు


ఏ పంటలు.. ఎప్పుడెప్పుడు


ఇంటిపట్టునే ఆకుకూరలు, కూరగాయలు సాగుచేసుకోవడానికి ఇప్పుడిప్పుడే సిద్ధమవుతున్న వారు.. ఇప్పటికే పెంచడం ప్రారంభించిన వారిలో కూడా కొందరు తరచూ అడుగుతున్న ప్రశ్న ఇది!
ఈ పట్టికలో పేర్కొన్న విధంగా 12 విభాగాల్లో (కుండీల్లో లేదా మడుల్లోని ఒక్కో చదరపు అడుగు స్థలంలో) సీజన్ల వారీగా ప్రణాళిక ప్రకారం విత్తనాలు వేసుకుంటే... ఇంటిల్లిపాదికీ అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు ఏడాది అంతా అందుబాటులో ఉంటాయి. అందరూ ఇదే వరుసలో వేసుకోవాలనేం లేదు. ఆయా కూరగాయలు, ఆకుకూరలపై ఇష్టాఇష్టాల ప్రకారం ఎవరికి వారు మార్పులు చేసుకోవచ్చు.

ఎండాకాలం: ఆనప, కాకర, బీర, పొట్లకాయ, గుమ్మడి, దొండ, బెండ, దోస, అన్ని రకాల ఆకుకూరలు..
వానాకాలం: అన్ని రకాల ఆకుకూరలు, వంగ, బెండ, గోరుచిక్కుడు, బీర, కాకర..
చలికాలం: బఠాణీలు, చిక్కుడు, టమాటా, క్యాబేజి, క్యాలీఫ్లవర్, ఆలుగడ్డలు, బీన్స్, క్యారట్..
ఎండలో / ఎక్కువ కాంతిలో పెరిగేవి: వంగ, టమాటా, మిరప..
నీడలో పెరిగేవి / నీడను ఇష్టపడేవి: చాలామటుకు ఆకుకూరలు, ఆవాలు, క్యాబేజి, క్యారట్, ముల్లంగి, చిలకడ దుంప మొక్కలు..
నిజానికి.. కొన్ని జాగ్రత్తలు పాటించగలిగితే.. ఇంటిపట్టున ఏ కాలంలోనైనా ఏ పంటలైనా సాగుచేసుకోవడానికి పెద్ద అడ్డంకులేమీ ఉండవు. అయితే.. పంటల సహజ స్వభావానికి విరుద్ధంగా ఆయా పంటల.. అననుకూల వాతావరణంలో పంటలు పండించాలంటే.. ఆయా పంటల ప్రత్యేక లక్షణాలు గ్రహించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. క్యారట్, క్యాబేజీ వంటి పంటలు సాధారణంగా చలికాలంలో/ శీతాకాలంలో చక్కగా పెరుగుతాయి. అధిక ఉష్ణాన్ని తట్టుకోలేకపోవడం వీటి సహజ లక్షణం. ఈ రెండు పంటలు చలికాలం పోయాక సాగు ప్రారంభిస్తే.. దిగుబడి అసలు రాకపోవచ్చు. మిగతా పంటలేవైనా ఏ కాలంలోనైనా విత్తుకోవచ్చు. అయితే, వాటికి బాగా అనుకూలంగా ఉన్న సీజన్‌లో దిగుబడి బాగా వస్తుంది. అననుకూల కాలంలో దిగుబడి ఓ మోస్తరుగా వస్తుంది. అంతే తేడా!
ఆకుకూరలు నెల రోజుల్లో కోతకు వస్తాయి. రెండు నెలలపాటు దిగుబడినిస్తాయి. బెండ విత్తిన నెలకు కాపుకొస్తుంది. 3 నెలలు కాస్తుంది. మిగతా కూరగాయ మొక్కలు దాదాపు 2 నెలలకు కాపుకొస్తాయి. 2 నెలలపాటు దిగుబడినిస్తాయి. మిరప మొక్కలు రెండు (రెండు నెలలకోసారి) వేసుకుంటే కుటుంబానికి సరిపోతాయి. కొత్తిమీర, పుదీన కుండీలు / మడుల అంచుల్లో చల్లుకుంటే సరిపోతాయి. ఎండాకాలంలో, ముఖ్యంగా టెరస్‌ల్రపై, కూరగాయల మొక్కలు పెంచాలనుకుంటే షేడ్‌నెట్‌తో ఎండ నుంచి రక్షణ కల్పించాలి. సెల్ఫ్ వాటరింగ్ పాట్స్‌ను/ మడులను ఏర్పాటుచేసుకోవచ్చు.
- సాక్షి స్పెషల్ డెస్క్

సందేహాలున్నాయా?
‘ఇంటి పంట’ పాఠకుల సందేహాలకు, సమస్యలకు సమాధానాలివ్వడానికి నిపుణులు నిత్యం అందుబాటులో ఉంటారు.
సికింద్రాబాద్ తార్నాకలోని సుస్థిర వ్యవసాయ కేంద్రం కార్యాలయంలో 040- 27014302 / 27017735 ఫోన్లలో నిపుణులు నిత్యం అందుబాటులో ఉంటారు. అన్ని పనిదినాల్లో సాయంత్రం 3 గం. నుంచి 6 గం. వరకూ ఫోన్ చేయవచ్చు.
హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని అగ్రి. హార్టికల్చరల్ సొసైటీ అధ్యక్షులు మిద్దెల అనంతరెడ్డిని 92461 08262 నంబరులో మధ్యాహ్నం 2 గం. నుంచి 4 గం. వరకూ సంప్రదించవచ్చు.

intipanta@googlegroups.com
‘ఇంటిపంట’ పాఠకులు సుస్థిర వ్యవసాయ కేంద్రం, అగ్రి. హార్టికల్చరల్ సొసైటీకి చెందిన నిపుణులను సంప్రదించడం కోసం ఇకపై గూగుల్‌గ్రూప్స్.కామ్‌ను వినియోగించుకోవచ్చు. ఇంటిపంటల సాగులో తమ అనుభవాలను ఇతరులతో పంచుకోవాలనుకునే వారు కూడా ఈ గ్రూప్ మెయిల్‌ను వినియోగించుకోవచ్చు.

intipanta@googlegroups.comకు మెయిల్ పంపితే చాలు ఈ గ్రూప్‌లో సభ్యులైపోవచ్చు. సభ్యుల్లో ఎవరు మరెవరికి మెయిల్ ఇచ్చినా.. దాని కాపీ ఆటోమేటిక్‌గా అందరికీ వస్తుంది. ఎవరైనా ఒక ప్రశ్నను నిపుణులను అడిగి సమాధానం పొందితే.. అది వారితో పాటు గ్రూప్‌లో సభ్యులందరికీ కూడా తెలుస్తుందన్న మాట!

కథనాలన్నీ ఒకేచోట..!
ఇంటి పంట
‘ఇంటి పంట’ శీర్షికలో కొన్ని వారాలుగా ప్రచురితమవుతున్న కథనాలన్నీ ఎక్కడ అందుబాటులో ఉంటాయి? అని కొందరు పాఠకులు అడుగుతున్నారు. వారి కోరిక మేరకు పాత కథనాలన్నిటినీ అందుబాటులో ఉంచాం. ఠీఠీఠీ.ట్చజుటజిజీ.ఛిౌఝ హోమ్ పేజీలో కుడి వైపున ఉన్న ‘ఇంటి పంట’ ఐకాన్‌ను క్లిక్ చేస్తే ఇంటి పంట కథనాలు కనిపిస్తాయి.

తనకు తానే నీరుపోసుకునే మడి


ఎండలు ముదురుతున్నాయనగానే..కూరగాయలు, ఆకుకూరల మడులకు, కుండీలకు రోజుకురెండు పూటలా నీళ్లుపోయాల్సి వస్తుందేమోనన్న ఆలోచనమదిలో మెదులుతుంది. అపార్ట్‌మెంట్లలో నివసించే వారురోజుకు రెండుపూటలా మేడ మీదకు వెళ్లి నీళ్లుపోసిరావాలంటే.. లిఫ్టు ఉన్నా సరే.. కొంచెం ఇబ్బందిగానేఉంటుంది. గ్రూప్ హౌస్‌లలో నివసించే వారికి లిఫ్టుఅందుబాటులో ఉండకపోవచ్చు. రెండు, మూడుఅంతస్థులు మెట్లెక్కి వెళ్లి రెండు పూటలా నీరు పోయడం కన్నా..కుండీలు వద్దు.. కూరగాయలు వద్దు.. అనిపించడం సహజం.

అంతెందుకు.. పెరట్లో ఉన్న మడులు, కుండీలకైనా రోజూ రెండుపూటలా నీరు పోయాల్సిరావడం.. ఇంట్లో అందరూ బీజీగా ఉండే ఈరోజుల్లో యాతనే కదా..? ఇలా ఆలోచిస్తుంటే... రోజూ నీళ్లు పోయాల్సిన అవసరం లేనికుండీలు లేదా మడులు ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది.. కదూ..! ఆలోచనకు సృజనాత్మకత జోడిస్తే ఏదైనా సాధ్యమే!అదుగో... అటువంటి చక్కటి పరిష్కారాలను మన ముందుకుతెస్తున్నది ‘హైదరాబాద్ గోస్ గ్రీన్’ సంస్థ.ముచ్చటగా..హుదా మసూద్ తన ఇంటిపైన ఏరాసిన తమకు తామే నీరుపోసుకునే (సెల్ఫ్ వాటరింగ్) కుండీలు, మడులుముచ్చటగొలుపుతున్నాయి. ఒకసారి పోసిన నీరు మొత్తాన్నీ ఆరోజేవినియోగించుకోవడం కాకుండా... ఆ నీటిని అడుగున నిల్వచేసుకొనిఅనేక రోజులపాటు వినియోగించుకోవడం వీటి ప్రత్యేకత. ఖాళీప్లాస్టిక్ సీసాలు రెండిటిని వినియోగించి సెల్ఫ్‌వాటరింగ్ బాటిల్ పాట్‌ను తయారు చేశారు.

ప్లాస్టిక్ కుండీకి అడుగున మరో చిన్న కుండీనిఅమర్చి.. ఒకసారి పోసిన నీటిని కొద్దిరోజులపాటు వినియోగించుకునే విధంగాఏరాఠ956?టు చేశారు. పాలిథిన్ షీట్ మధ్యలో ఇటుకలమడిని ఏరాసి.. నీటిని నిల్వచేసుకొని..కొన్ని రోజుల తరబడి ఆ నీటినివినియోగించుకునేలా వినూత్నంగా చిన్న మడిని ఏరాయడంఆసక్తిగొలుపుతోంది. అడుగున్నర ఎత్తున్న ప్లాస్టిక్ టబ్‌లో అడుగున.. 3పెద్ద ఖాళీ ప్లాస్టిక్ సీసాలను తగినవిధంగా కత్తిరించి అమర్చి.. సెల్ఫ్‌వాటరింగ్ టబ్‌ను తయారుచేశారు.... కుండీ అయినా, టబ్ అయినా,మడి అయినా.. వర్మీ కంపోస్టు, కొబ్బరి పొట్టు (సమాన పాళ్లలో)మిశ్రమంపై నేరుగా ఎండపడకుండా.. ఏదో ఒక ఎండువ్యర్థపదార్థాన్ని ఆమె కప్పుతున్నారు. ఈ ప్రక్రియను ‘మల్చింగ్’అంటారు. పాత పరుపు అడుగున ఉన్న కొబ్బరి పీచును,ఎండుఆకులను మల్చింగ్‌కు వాడుతున్నారు. టెరస్‌ల్రపై చోటంతా వృథాయేనా..?ఖాళీ ప్లాస్టిక్ సీసాకు నిలువెల్లా బెజ్జాలు పెట్టి మడి లేదా కుండీలోఉంచారు. ఈ సీసా ఖాళీగానే ఉంటుంది. ఆ బెజ్జాల ద్వారా మడి లేదాకుండీలోని కంపోస్టు, కొబ్బరి పొట్టు మిశ్రమం... తద్వారా మొక్క వేళ్లుచక్కగా గాలిపోసుకుంటాయని హుదా మసూద్ (huda@hyderabadgoesgreen.com) తెలిపారు. టెరస్‌ల్రపైన చోటంతా వృథాఅవుతున్నదని అంటూ.. కొంచెం శ్రద్ధతో చక్కగా ఏడాదిపొడవునాకూరగాయలు, ఆకుకూరలు పెంచుకోవడానికి ఈ చోటును సమర్థంగావినియోగించుకోవాలని ఆమె పక్కా భవనాల యజమానులకు,వాటిలో నివసిస్తున్న వారికి సూచిస్తున్నారు.

అరుగుల, సెలరీ వంటివిదేశీ ఆకుకూరలను కూడా ఆమె శ్రద్ధగా పెంచుతున్నారు. సలాడ్లలో,కూరల్లో తాజాగా వినియోగించుకోవడానికి వీలుగా వేసవిలోనూసులువుగా వివిధ మొక్కలు పెంచుకోవచ్చన్నారు. - సాక్షి సెషల్ డెస్క్

అపూర్వ సదన..రేపు, ఎల్లుండీ వర్క్‌షాపులు..‘ఇంటి పంట’ యజ్ఞంలో పాలుపంచుకుంటున్న వారిలోఅవగాహనను మరింత పరిపుష్టం చేయడానికి ఈ వారం నుంచే‘సాక్షి’ ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి వర్క్‌షాపులునిర్వహించబోతున్న విషయం తెలిసిందే. వర్క్‌షాపు తేదీప్రకటించిన తర్వాత ‘ఇంటిపంట’పై ఆసక్తిగల పాఠకులువందలాదిగా ఫోన్లుచేసి పేర్లు నమోదుచేసుకుంటున్నారు. ప్రజలనుంచి లభించిన అపూర్వ సదనను దృష్టిలో ఉంచుకొని..రెండోరోజు (మార్చి 6వ తేదీ ఆదివారం) కూడా వర్క్‌షాపునిర్వహించాలని నిర్ణయించాం.

తొలి వర్క్‌షాపు మార్చి 5వ తేదీ (శనివారం) సాయంత్రం 4గంటల నుంచి 6 గంటల వరకూ.. హైదరాబాద్ నడిబొడ్డున పబ్లిక్‌గార్డెన్స్‌లోని ‘అగ్రి.హార్టికల్చరల్ సొసైటీ’ ఆవరణలో యధావిధిగాజరుగుతుంది. అదేవిధంగా మార్చి 6వ తేదీ ఆదివారం ఉదయం11 గంటల నుంచి 1 గంట వరకూఅదే వేదికపై వర్క్‌షాపుజరుగుతుంది. ప్రవేశం ఉచితం. నిపుణులతో ముఖాముఖిచర్చించవచ్చు. ‘ఇంటి పంట’కు అవసరమైన కుండీలు, విత్తనాలు,వర్మీ కంపోస్టు, వర్మీవాష్, మట్టి మిశ్రమంతోపాటు టెరక్రోటకంపోస్టర్లు కూడా లభిస్తాయి.
- ఎడిటర్

ఖాళీ బాటిళ్లతోనూ...

ఖాళీ బాటిళ్లతో ఇలా తయారుచేసిన సెల్ఫ్ వాటరింగ్ పాట్‌లలోమొక్కలు పెంచవచ్చ్చు.. ఇందుకు లీటరున్నర ఖాళీ ప్లాస్టిక్ బాటిల్స్‌రెండు కావాలి. కత్తిరించిన బాటిల్ అడుగు భాగానికి కొబ్బరి తాడుచుట్టాలి (త్వరగా వేడెక్కకుండా ఉండడానికి, బలంగా ఉండడానికేతాడు చుట్టడం).. మరో బాటిల్ అడుగు కోసేసి.. పై భాగానికిపురికొస చుట్టాలి. ఫొటోలో ఉన్నట్లు.. బాటిల్‌కు అంగుళానికో చోటచీల్చాలి.

అడుగున మూతను కొంచెం వదులు చేయాలి. ఆ తర్వాత..అడుగు బాటిల్‌లో నీళ్లు సోసి.. పై బాటిల్‌లో మట్టిపోసి.. మొక్కలుపెట్టాలి... అంతే! ఎండాకాలమైనా.. వారానికి రెండు రోజులు నీరుపోస్తే చాలు... మొక్క తనకు అవసరమైనప్పుడు మట్టి ద్వారా అడుగునుంచి నీటిని తీసుకుంటుందన్నమాట!

ఉన్నత విద్య చదివి..!

పర్యావరణానికి చేటు చేయని వివిధఉత్తులను ప్రజలకు అందుబాటులోకితెస్తోంది ‘హైదరాబాద్ గోస్ గ్రీన్’(www.hyderabadgoesgreen.com)సంస్థ. హైదరాబాద్ కేంద్రంగాపనిచేస్తున్న ఈ సంస్థను ఉన్నతవిద్యావంతులైన అభినవ్ గంగుమళ్ల (74167 90905), హుదామసూద్ నిర్వహిస్తున్నారు. వంటింటి వ్యర్థాలను సేంద్రియఎరువుగా మార్చే టెరక్రోట కంపోస్టర్లు, నూలు వ్యర్థాలతోక్యారీబ్యాగ్‌లు, హోలీ సంబరాల కోసం సహజ రంగులతోపాటు‘తనకు తానే నీరుపోసుకునే కుండీ’ (సెల్ఫ్ వాటరింగ్ పాట్)లనుప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు.

అంతేకాదండోయ్..సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు ఇంటిపట్టునేపండించుకోవాలనుకునే వారి ఇళ్లకు వచ్చి..ఆ చోటుకు తగిన రీతిలోకుండీలు, మడులను ఏరాయడం.. పంచగవ్య.. అరుదైనఔషధ మొక్కలను అడిగిన వారి ఇంటికితెచ్చివ్వడం.. వీరు పనిగా పెట్టుకున్నారు.

ముంబై ఐఐటీలో ఎంటెక్ చేసిన అభినవ్,దంత వైద్యంలో పట్టాపుచ్చుకున్న హుదామసూద్ సంప్రదాయక ఉద్యోగాలువదలిపెట్టి.. పర్యావరణ సహనుపెంపొందించే పనిని మక్కువతోఎంచుకున్నారు. ఇష్టపడి చేస్తున్న ఈ పని తమకు ఎంతో సంతృప్తినిఇవ్వడంతోపాటు.. గిట్టుబాటుగానూ ఉందని చెప్తున్నారు! సెల్ఫ్ వాటరింగ్ స్క్వేర్‌ఫుట్ గార్డెన్(మడుల)ను గ్రేటర్‌హైదరాబాద్ ప్రాంతంలో అడిగిన వారి ఇంటికి వచ్చి వెంటనేఅమర్చగలమని, సెల్ఫ్ వాటరింగ్ పాట్స్, టబ్స్‌ను అమర్చడానికిమరో రెండు వారాల సమయం అవసరమవుతుందని అభినవ్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నా.. స్థానికులెవరైనా ముందుకు వస్తే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా సేవలందించడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు.


‘ఇంటిపంట’ నిపుణులను సంప్రదించవచ్చు‘ఇంటి పంట’ పాఠకుల మదిలో తలెత్తుతున్న సందేహాలకు,సమస్యలకు సమాధానాలివ్వడానికి నిపుణులు నిత్యంఅందుబాటులో ఉంటారు. సికింద్రాబాద్ తార్నాకలోని సుస్థిర వ్యవసాయ కేంద్రంకార్యాలయంలో 040- 27014302 / 27017735 ఫోన్లలోనిపుణులు నిత్యం అందుబాటులో ఉంటారు. అన్ని పనిదినాల్లోసాయంత్రం 3 గం. నుంచి 6 గం. వరకూ ఫోన్ చేయవచ్చు. ్ల%హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని అగ్రి. హార్టికల్చరల్ సొసైటీఅధ్యక్షులు మిద్దెల అనంతరెడ్డిని 92461 08262 నంబరులోసాయంత్రం 2 గం. నుంచి 4 గం. వరకూ సంప్రదించవచ్చు.

intipanta@googlegroups.com‘ఇంటిపంట’ పాఠకులు సుస్థిర వ్యవసాయ కేంద్రం, అగ్రి.హార్టికల్చరల్ సొసైటీకి చెందిన నిపుణులను సంప్రదించడంకోసం ఇకపై గూగుల్‌గ్రూప్స్.కామ్‌ను వినియోగించుకోవచ్చు.ఇంటిపంటల సాగులో తమ అనుభవాలను ఇతరులతోపంచుకోవాలనుకునే వారు కూడా ఈ గ్రూప్ మెయిల్‌నువినియోగించుకోవచ్చు.

intipanta@googlegroups.comకుమెయిల్ పంపితే చాలు ఈ గ్రూప్‌లో సభ్యులైపోవచ్చు. సభ్యుల్లోఎవరు మరెవరికి మెయిల్ ఇచ్చినా.. దాని కాపీ ఆటోమేటిక్‌గాఅందరికీ వస్తుంది. ఎవరైనా ఒక ప్రశ్నను నిపుణులను అడిగిసమాధానం పొందితే.. అది వారితో పాటు గ్రూప్‌లోసభ్యులందరికీ కూడా తెలుస్తుందన్న మాట!

తియ్యటి దివ్యౌషధం


విష రసాయనాలు వాడకుండా ఇంటిపట్టునే సేంద్రియ పద్ధతుల్లో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవడం ఎలాగో ‘ఇంటి పంట’ శీర్షికలో గత రెండు నెలలుగా చర్చించుకుంటున్నాం కదా.. ఆరోగ్యానికి హాని కలిగించని స్వచ్ఛమైన ఆహారం ఉన్నంతలో తమకు తామే పండించుకోవాలన్న తపన నగరాలు- పట్టణాల్లో నివసించేవారిలో కూడా నానాటికీ పెరుగుతోంది.

‘ఇంటి పంట’ కథనాలకు రాష్ట్రం నలుమూలల నుంచి పాఠకులు స్పందిస్తున్నారు. అయితే, ‘ఇంటి పంట’లతో పాటు అతిముఖ్యమైన కొన్ని ఔషధ మొక్కలు కూడా పెంచుకుంటే బాగుంటుందన్న అభిలాషను కొందరు పాఠకులు వ్యక్తంచేస్తున్నారు. వారి కోరిక మేరకు.. అందరి ఇళ్లలో ఇప్పటికే అందుబాటులో ఉండే తులసి వంటి ఔషధ మొక్కలను కాకుండా... కొన్ని అరుదైన ఔషధ మొక్కలను పాఠకులకు పరిచయం చేయాలని ‘సాక్షి’ భావిస్తోంది. ఈ పరంపరలో ‘స్టీవియా’ మొదటిది.

స్టీవియా... మధుమేహం ఉన్న వారూ నిర్భీతిగా తియ్యదనాన్ని ఆస్వాదించడానికి అవకాశం కల్పిస్తున్న అరుదైన మొక్క ఇది. తెలుగులో దీన్ని ‘తీపి మొక్క’ అనొచ్చు. మధుమేహాన్ని బొత్తిగా పెంచని మహా తీపి ఔషధ మొక్క ఇది! చక్కెరకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ తీపినిచ్చే ఈ మొక్క.. అసలు ఏమాత్రం షుగర్‌ను పెంచదంటే ఆశ్చర్యం కలగొచ్చు.. కానీ ఇది నిజంగా నిజం!!

ఆసియాలో పుట్టిన ఈ మొక్క దక్షిణ అమెరికా అడవుల్లో వర్థిల్లింది. రెండొందల ఏళ్లుగా గిరిజనులు వాడుతున్న ఈ మొక్క గురించి జపాన్, కొరియా వంటి దేశాల్లో విస్తృతంగా పరిశోధన జరుగుతోంది. దీన్ని పొలాల్లో.. ఇంటి పట్టున కుండీలు, మడుల్లోనూ స్టీవియాను నిక్షేపంగా పెంచవచ్చు. రెండు నుంచి రెండున్నర అడుగుల ఎత్తు పెరుగుతుంది. 3 నెలల్లో కోతకు వస్తుంది. పూత కనిపించగానే మొక్కను కత్తిరించవచ్చు. దీన్ని ఒకసారి తెచ్చుకొని నాటితే చాలు. తామర తంపరగా పిలకలు వస్తూనే ఉంటాయి. కొమ్మను తుంచి నాటినా సులభంగానే 10 - 15 రోజుల్లో వేరుపోసుకుంటుంది. అంటే.. ఈ తీపిమొక్కను మళ్లీ మళ్లీ కొనుక్కోనక్కర్లేదన్న మాట! సాధారణంగా ఎండను ఇష్టపడే ఈ మొక్క.. 35 డిగ్రీలకు మించిన వేడిని భరించలేదు. పొలాల్లో సాగుచేస్తే స్ప్రింక్లర్లు అమర్చుకోవాల్సి ఉంటుంది. ఇంటి వద్ద, మేడపైన కుండీలు, మడుల్లో నిస్సందేహంగా పెంచుకోవచ్చు. ఎండ తక్కువగా తగిలే చోట అంతగా ఎత్తు పెరగకపోవచ్చు. 35 డిగ్రీలకన్నా ఎక్కువ వేడి ఉండేపనైతే షేడ్‌నెట్ ఏర్పాటుచేసుకుంటే.. ఏ కాలంలోనైనా స్టీవియా తియ్యటి ఆకులు , మధుమేహం ఉన్న వారితో సహా, ఇంటిల్లిపాదికీ నోరూరిస్తూనే ఉంటాయి! స్టీవియా ఆకులు, కాండం కూడా ఔషధగుణాలు కలిగి ఉన్న మొక్క. ఇందులో వృథా పోయేదేమీ ఉండదు.

టీ / కాఫీల్లో.. స్వీట్లలో..
స్టీవియా పొడిని, లేదా ఆకులను టీ, కాఫీ, శీతలపానీయాల్లో.. ఒకటేమిటి తియ్యటి పిండివంటల్లోనూ పంచదార / బెల్లానికి బదులుగా వాడుకోవచ్చు. పచ్చి ఆకులు తినొచ్చు. ఆకును కొంచెం కొరికి బుగ్గన పెట్టుకుంటే.. తియ్యటి తాజాదనాన్నిస్తుంది. దీంట్లో ఒక్క కేలరీకూడా లేదు. తక్కువ కేలరీలు తినాలకునే వారికి ఎంతో ఉపకరిస్తుంది. కూరల్లో కూడా వేసుకోవచ్చు! ఔషధంలా మాత్రమే కాకుండా.. ఫుడ్ సప్లిమెంట్‌గా ఇంటిల్లిపాదీ వాడుకోవడానికి వీలైన మొక్క స్టీవియా.

స్టీవియా జ్యూస్
స్టీవియా ఆకులు, కాండం పొడితో రసం తయారుచేసుకొని.. ఫ్రిజ్‌లో 3 వారాల వరకూ నిల్వ చేసుకొని అవసరమైనప్పుడల్లా వాడుకోవచ్చు. కప్పు పొడికి 5 కప్పుల నీరు జోడించి 15 - 20 నిమిషాలు మరగకాయాలి. ఆ తర్వాత 12 గంటల పాటు దానికదే చల్లారనివ్వాలి. వడకట్టి వాడుకోవచ్చు. ఫ్రిజ్‌లో కాకుండా నిల్వచేయాలంటే.. ప్రిజర్వేటివ్‌లు కలపాల్సి ఉంటుంది. అయితే, తాజాగా వాడుకోవడమే ఉత్తమం.

ప్రాచుర్యంలోకి తెచ్చిన విశ్రాంత ఇంజనీర్
స్టీవియాను హైదరాబాద్‌లో నివసిస్తున్న కలవలపల్లి వెంకట రమణారావు (93911 57340 / 040- 23811220) అనే విశ్రాంత ఇంజనీర్ తెలుగునాట ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆయన స్వయంగా రంగారెడ్డి

ఇది సర్వరోగ నివారిణి!

స్టీవియా మధుమేహం ఉన్న వారికే కాదు.. అందరికీ దివ్యమైన సంపూర్ణ ఔషధం. ప్రపంచ ఆహార సంస్థ, జాతీయ పోషకాహార సంస్థ దీన్ని ఆమోదించాయి. సర్వరోగ నివారిణి. స్టీవియా పొడి చక్కెర కన్నా 20-30 రెట్టు తియ్యనిది. దీని రసం చక్కెర కన్నా వంద రెట్లు తియ్యగా ఉంటుంది. రిఫైన్డ్ వైట్ స్టీవియా పౌడర్ ఇంకా ఎక్కువ తియ్యగా ఉంటుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్. లివర్‌లో మలినాలను శుద్ధిచేయడంతోపాటు ఎన్నో వ్యాధులను పారదోలుతుంది.

నాకు తెలిసిన నలుగురికి కేన్సర్ కూడా నయమైంది. ప్లేట్‌లెట్స్ వంటి తీవ్ర వ్యాధులూ తగ్గుతున్నాయి. వీటికి నా దగ్గర రుజువులున్నాయి. అద్భుతమైన ఈ ఫలితాలు చూసి.. ప్రభుత్వ రంగ సూపర్‌స్పెషాలిటీ వైద్యులు ప్రత్యేక పరిశోధనలు ప్రారంభించారు. ఈ దివ్యౌషధాన్ని నలుగురికీ అందుబాటులోకి తేవడంతో నా జన్మ ధన్యమైంది.
- కలవలపల్లి వెంకట రమణారావు, హైదరాబాద్

నిస్సందేహంగా వాడొచ్చు

రెండొందల ఏళ్ల నుంచి దక్షిణ అమెరికాలో గిరిజనులు వాడుతున్న ఈ మొక్కను తదనంతరకాలంలో అనేక దేశాల్లో వాడుతున్నారు. స్వీట్ తినలేం అనుకునే మధుమేహ రోగులు కూడా నిస్సందేహంగా వాడొచ్చు. ఇందులో కాలరీలు లేవు. షుగర్‌ను పెంచదు. పానీయాల్లోనే కాకుండా స్వీట్లలోనూ వాడొచ్చు. జపాన్, కొరియాల్లో దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. స్టీవియా మొక్కను పొలాల్లోనే కాదు.. కుండీల్లోనూ చక్కగా పెంచుకోవచ్చు. విదేశీ మార్కెట్లలోనూ స్టీవియాకు గిరాకీ ఉంది.
- డాక్టర్ కొండపల్లి నరసింహారెడ్డి (98480 21691),
ఆయుర్వేద వైద్య నిపుణులు

రేపు ఉప్పల్‌లో ‘ఇంటి పంట’ వర్క్‌షాప్

‘ఇంటి పంట’ యజ్ఞంలో భాగంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీ (శనివారం)న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకూ ఉప్పల్ మెయిన్ రోడ్డులోని.. ‘సర్వే ఆఫ్ ఇండియా’ సంస్థ ఆవరణలో గల ఆడిటోరియంలో ‘ఇంటి పంట’ వర్క్‌షాప్ జరుగుతుంది. స్టీవియా మొక్కలు, కొబ్బరి పొట్టుతో తయారుచేసిన సేంద్రియ ఎరువు, కుండీలు.. అందుబాటులో ఉంటాయి. రాజేంద్రనగర్‌లోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న వ్యవసాయ పరిశోధన సంస్థ(ఏఆర్‌ఐ)లోని కూరగాయల పరిశోధన విభాగం వారి కూరగాయలు, ఆకుకూరల విత్త నాలు లభిస్తాయి. అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. పాల్గొనదలచిన వారు 040- 23303849 నంబర్‌కు (ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య) ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవచ్చు.

విత్తనాలు దొరకట్లేదా?

ఇంటి వ ద్ద కూరగాయాలు పండించుకుందామంటే విత్తనాలు లభించట్లేదా? ఎక్కడ దొరుకుతాయో తెలియట్లేదా? రాజేంద్రనగర్‌లోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న వ్యవసాయ పరిశోధన సంస్థ(ఏఆర్‌ఐ)లోని కూరగాయల పరిశోధన విభాగంలో కిచెన్ గార్డెన్ కిట్స్ లభిస్తున్నాయి. ఇందులో దాదాపుగా 12 రకాల కూరగాయలు, ఆకు కూర మొక్కల విత్తనాలు (టమాట, వంకాయ, బీర, సొర, కాకర, పొట్ల, తోటకూర, పాలకూర, గోంగూర, బెండ, చిక్కుడు సహా) లభిస్తాయి. ఈ కిట్ ధర * 25 మాత్రమే. వివరాలకు 040-24018016 నంబర్‌లో సంప్రదించవచ్చు.

చక్కని సేంద్రియ ఎరువు సీ-పామ్



కొబ్బరి పొట్టుతో తయార్లీ%నెదర్లాండ్స్, ఇజ్రాయెల్ తదితర దేశాల్లోనూ కూరగాయల సాగుకు వినియోగం

విష రసాయనాలు సోకకుండా ఇంటిపట్టున ఓపిగ్గా ఆకుకూరలు, కూరగాయలు పెంచుకుందామంటే.. కంపోస్టు దొరకడమే గగనమవుతోందని ‘ఇంటిపంట’ పాఠకులు తరచూ అంటున్నారు. నిజమే!కొబ్బరి పొట్టుతో తయారైన సేంద్రియ ఎరువు (COIR-PITORGANIC MANURE.. C-POM)చక్కని ప్రత్యామ్నాయం.

రాజమండ్రిలోని కేంద్ర ప్రభుత్వానికి చెందిన కాయర్ బోర్డుప్రాంతీయ కార్యాలయం (0883-2420196) ఈ సరికొత్త సేంద్రియఎరువు తయారీని ప్రోత్సహిస్తోంది. కొబ్బరి పొట్టుతో సీ-పామ్ తయారుచేయడంలో రైతులకు, పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తోంది.

కేజీ కొబ్బరి పీచును తయారుచేసేటప్పుడురెండు కేజీల కొబ్బరి పొట్టు వస్తుంది. ఏంచేసుకోవాలో తెలియనిపరిస్థితుల్లో కొబ్బరి పొట్టు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయేది. నీటినిమట్టికన్నా 8, 9 రెట్లు అధికంగా పట్టిఉంచే స్వభావం ఉన్న కొబ్బరిపొట్టు.. ‘ఇంటి పంట’ పండించుకునే వారికి చక్కటి వరంలాంటిదనిచెపొఠ956?చ్చు.

పొలాల్లో పంటలు విస్తారంగా సాగుచేసే రైతులు కూడాసీ-పామ్‌ను నిస్సందేహంగా ఎరువుగా వాడుకోవచ్చని కాయర్ బోర్డునిపుణులు తెలిపారు. సీ-పామ్ తయారైన తర్వాత.. ఎన్నాళ్లయినానిల్వ ఉంచుకొని వాడుకోవడానికి అనువైన సేంద్రియ ఎరువు ఇది! నెదర్లాండ్స్ పరిశోధనల ఫలం సీ-పామ్.. సంపూర్ణ పోషకాలు సీ-పామ్‌లో ఉంటాయని...కేవలం దీనిని వాడి కూరగాయలు, ఆకుకూరలు,పండ్లమొక్కలు, ఔషధ మొక్కలు ఇంటిపట్టునేహాయిగా పెంచుకోవచ్చని కాయర్ బోర్డు నిపుణులు చెప్తున్నారు.

కొబ్బరి పొట్టుతో చక్కటిసేంద్రియ ఎరువు తయారుచేసి కూరగాయలుసాగు చేయడంలో ఫలప్రదమైన పరిశోధనలు చేసినది నెదర్లాండ్స్. ఇజ్రాయెల్ తదితర దేశాలు కూడా సీ-పామ్‌నువిస్తృతంగా వినియోగిస్తున్నాయి. శ్రీలంక, భారత్ నుంచి భారీ ఎత్తునఈ దేశాలు ముడి కొబ్బరి పొట్టును దిగుమతి చేసుకుంటున్నాయి.

మన రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే దీని ఉత్త, వినియోగంపుంజుకుంటున్నది. కొబ్బరి పొట్టుతో సీ-పామ్ తయారీ సులభమే..సీ-పామ్ సేంద్రియ ఎరువు తయారుచేయడానికి యంత్ర సామగ్రిగట్రా ఏమీ అవసరం లేదు. ప్రతి పంటకూ ఈ ఎరువును ఉపయోగించుకోవచ్చు. కొబ్బరి కాయలపై పీచు తీసినప్పుడు వచ్చే కొబ్బరిపొట్టులో.. కొద్దిగా (ప్లీరోటస్ సోజార్ కాజు అనే) శిలీంద్రాన్ని.. ఆశిలీంద్రం బతికి ఉండడానికి కొంచెం (టన్ను కొబ్బరి పొట్టులో కిలో)యూరియాను కలిపి.. పొరలు పొరలుగా పరవాలి.

ఉదయం,సాయంత్రం నీటితో తడపాలి.. ఇలా 30 రోజుల పాటు చేస్తే సీ-పామ్‌ఎరువు తయారవుతుంది. ఈ శిలీంద్రాన్ని రాజమండ్రిలోని కాయర్‌బోర్డు సరసమైన ధరకు సరఫరా చేస్తోంది. కిలో ప్యాకెట్ నుంచి 50కిలోల బస్తాల సైజులో మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇంతసింపుల్‌గా తయారయ్యే సహజ ఎరువు ‘ఇంటి పంట’లకు ఎంతోఅనుకూలం కదండీ..!-
న్యూస్‌లైన్ , పెరవలి (ప.గో. జిల్లా)

నిపుణులను సంప్రదించవచ్చు‘ఇంటి పంట’ పాఠకుల మదిలో తలెత్తుతున్న సందేహాలకు,సమస్యలకు సమాధానాలివ్వడానికి నిపుణులు నిత్యంఅందుబాటులో ఉంటారు. సికింద్రాబాద్ తార్నాకలోని సుస్థిర వ్యవసాయ కేంద్రంకార్యాలయంలో 040- 27014302 / 27017735 ఫోన్లలోనిపుణులు నిత్యం అందుబాటులో ఉంటారు. అన్ని పనిదినాల్లోసాయంత్రం 3 గం. నుంచి 6 గం. వరకూ ఫోన్ చేయవచ్చు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని అగ్రి. హార్టికల్చరల్ సొసైటీఅధ్యక్షులు మిద్దెల అనంతరెడ్డిని 92461 08262 నంబరులోమధ్యాహ్నం 2 గం. నుంచి 4 గం. వరకూ సంప్రదించవచ్చు.

ఇది చక్కటి సేంద్రియ ఎరువు
- మేడిది రామచంద్రరావు (92477 98246), టెక్నికల్ అసిస్టెంట్, కాయర్ అభివృద్ధి బోర్డు, రాజమండ్రి మొక్కలు పెరగడానికి అవసరమైన అన్ని పోషకాలూకొబ్బరి పొట్టుతో తయారైన సీ-పామ్ సేంద్రియ ఎరువులోపుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి పొట్టు ఎరువుతో మట్టి,ఇతర కంపోస్టు ఏమీ కలపనక్కర్లేదు. ముడి కొబ్బరిపొట్టులో కర్బనం అధికంగా ఉంటుంది. అధికంగా ఉన్న కర్బనంను తొలగించేందుకు ప్లీరోటస్ సోజార్ కాజు అనే శిలీంద్రంతో కొబ్బరి పొట్టును శుద్ధి చేస్తున్నాం.5 టన్నుల ముడి కొబ్బరి పొట్టుతో 3.75 టన్నుల సీ-పామ్ సేంద్రియ ఎరువుతయారవుతుంది.

‘ఇంటి పంట’లకు సీ-పామ్ చాలా అనుకూలం. 2 కిలోల సీ-పామ్‌ను 12 రూపాయలకు రాజమండ్రిలోని మా కార్యాలయంలో అమ్ముతున్నాం.మొక్కలు తిరిగి నాటడానికి నర్సరీ ట్రేలలోంచి పీకినప్పుడు వేళ్లు దెబ్బతినకుండాఉండేలా సీ-పామ్ ఉపకరిస్తుంది. నర్సరీలలో దీన్ని బాగా వాడుతున్నారు.సీ-పామ్ తయారీ పెద్ద మార్కెట్ ఉన్న బిజినెస్. ఇంటిపట్టున కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే వారు కూడా నిస్సందేహంగా ఈ ఎరువు వాడుకోవచ్చు.మట్టికన్నా 8, 9 రెట్లు తేమను పట్టి ఉంచే స్వభావం ఉన్న ఈ ఎరువు ‘ఇంటిపంట’లకు చక్కగా నప్పుతుంది.

వాడిన తర్వాతే అమ్ముతున్నాను
- చిట్టూరి శ్రీవెంకట సుబ్బారావు (98485 29525), కాయర్ బోర్డు సభ్యుడు, పెరవలి (ప.గో. జిల్లా) శాస్తవ్రేత్తల సూచనమేరకే కొబ్బరిపొట్టుతో పోషక విలువలున్న సీ-పామ్‌సేంద్రియ ఎరువునుమూడేళ్లుగా తయారుచేస్తున్నాను. సొంత చేలకు ఉపయోగించిభూసారం పెరుగుతున్నదని సంతృప్తి చెందినతర్వాతే అమ్మకానికి పెడుతున్నాం. ఈసేంద్రియ ఎరువు గురించి వ్యవసాయాధికారులు, ఉద్యానవన అధికారులు ప్రజల్లో చైతన్యంతీసుకు వస్తే అటు రైతుకు.. ఇటు భూములకుఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

నేడు, రేపు ‘ఇంటి పంట’ వర్క్‌షాపులు
‘ఇంటి పంట’యజ్ఞంలో భాగంగా ‘సాక్షి’ఆధ్వర్యంలో ఈనెల 5నుంచి నిర్వహించనున్నవర్క్‌షాపులకు ఏరాపూర్తయ్యాయి. తొలివర్క్‌షాపు మార్చి 5వ తేదీ (శనివారం) సాయంత్రం4 గంటల నుంచి 6 గంటల వరకూ.. హైదరాబాద్‌నడిబొడ్డున పబ్లిక్ గార్డెన్స్‌లోని ‘అగ్రి.హార్టికల్చరల్‌సొసైటీ’ ఆవరణలో జరుగుతుంది. పాఠకుల అపూర్వ సదనను దృష్టిలోఉంచుకొని మార్చి 6వ తేదీ (ఆదివారం) ఉదయం11 గంటల నుంచి 1 గంట వరకూపబ్లిక్ గార్డెన్స్‌లోఅదే వేదికపై వర్క్‌షాపు జరుగుతుంది.

ప్రవేశంఉచితం. నిపుణులతో ముఖాముఖి చర్చించవచ్చు.‘ఇంటి పంట’కు అవసరమైన కుండీలు, విత్తనాలు,వర్మీ కంపోస్టు, వర్మీవాష్, మట్టి మిశ్రమంతోపాటుటెరక్రోట కంపోస్టర్లు కూడా లభిస్తాయి.12న ప్రగతి నగర్ స్కూల్‌లో వర్క్‌షాపుఇకపై ప్రతి శనివారం సాయంత్రం గ్రేటర్‌హైదరాబాద్ పరిధిలోని ఏదో ఒక చోట ‘ఇంటిపంట’ వర్క్‌షాపు జరుగుతుంది. ఈనెల 12వతేదీ(శనివారం)నకూకట్‌పల్లి జేఎన్‌టీయూఎదురురోడ్డులోని ప్రగతి నగర్ సమీపంలో (‘ఎలీప్’వద్ద) గల ధ్యానహిత స్కూల్ ఆవరణలో..సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యవర్క్‌షాపు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే.

‘ఇంటి పంట’ల కోసం యాక్షన్ టీమ్‌లు


డిప్యూటీ డెరైక్టర్ వెంకట్ రామ్‌రెడ్డి వెల్లడి

ఉద్యాన పంటల సాగులో రెండేళ్ల డిప్లొమా పూర్తిచేసి ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వందలాది మందికి ఇది శుభవార్త. ‘సాక్షి’ దినపత్రిక ప్రారంభించిన ‘ఇంటి పంట’ యజ్ఞానికి లభిస్తున్న విశేష ప్రజాదరణ.. సరికొత్త ఉపాధి అవకాశాలకు ద్వారాలు తెరుస్తోంది. ‘ఇంటి పంట’లపై నగరాలు, పట్టణప్రాంత వాసుల్లో వ్యక్తమవుతున్న అమిత ఆసక్తి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యాన శాఖను ఆలోచింపజేసింది. రాష్ట్రంలో ప్రతి ఏటా 400 మంది యువతీయువకులు రెండేళ్ల ‘హార్టికల్చర్ డిప్లొమా’ పూర్తిచేస్తున్నారు. వీరిలో చాలా మంది ఉద్యోగాల వేటలోనే కాలం గడిపేస్తున్నారు. ఈ డిప్లొమా హోల్డర్లకు సాక్షి ‘ఇంటి పంట’ వెలుగులో సరికొత్త ఉపాధి మార్గం చూపాలని భావిస్తున్నామని ఉద్యాన శాఖ డిప్యూటీ డెరైక్టర్ (పబ్లిక్ గార్డెన్స్) ఎల్. వెంకట్ రామ్‌రెడ్డి వెల్లడించారు.

అభ్యర్థులకు హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో 15 రోజుల పాటు శిక్షణనిస్తారు. పట్టణాలు, నగరాల్లో ఇళ్ల వద్ద, మేడలపైన సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలు పెంచడం.. పార్కుల్లో రాలిన ఆకులు, ఇతరత్రా వ్యర్థాలతో కంపోస్టు (ఆకు ఎరువు) తయారుచేయడం.. తదితర అంశాలపై ఇంటెన్సివ్ శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. శిక్షణ పూర్తయిన తర్వాత వీరు స్వయంగా అపార్ట్‌మెంట్లలో, ఇళ్ల వద్ద, ఇళ్లపైన మడులు, కుండీల్లో కూరగాయల పెంపకానికి సంబంధించిన యాక్షన్ టీమ్‌లుగా ఏర్పడతారు. ‘ఇంటి పంట’లపై ఆసక్తి ఉండి, తగిన తీరిక లేదని భావించే పట్టణ ప్రాంత వాసులు ఈ యాక్షన్ టీమ్‌లకు సర్వీస్ చార్జీ చెల్లించి.. తమ ఇళ్ల వద్ద మడులు, కుండీలను ఏర్పాటు చేయించుకోవచ్చు. తదనంతర యాజమాన్య సేవలు, కంపోస్టు తదితరాలను కూడా వీరి ద్వారా పొందడానికి వీలవుతుంది. అంటే ఇంటిపట్టున ఆకుకూరలు, కూరగాయల సాగుకు అవసరమైన ఇన్‌పుట్స్ అందుబాటులో లేవన్న ఇబ్బంది పట్టణప్రాంతవాసులకు తొలగిపోతుందన్న మాట. ఈ సరికొత్త ఉపాధి మార్గంపై ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని హార్టికల్చర్ డిప్లొమా హోల్డర్లు డిప్యూటీ డెరైక్టర్ వెంకట్ రామ్‌రెడ్డిని (94904 90270, 040- 23234091) సంప్రదించవచ్చు.

పబ్లిక్ గార్డెన్స్ నర్సరీలో ‘ఆకు ఎరువు’ తయారీ
ఆకుల వ్యర్థాలతో చక్కని సేంద్రియ ఎరువును తయారుచేసుకోవడం గురించి సాక్షి ‘ఇంటి పంట’లో అచ్చయిన కథనానికి వెంకట్ రామ్‌రెడ్డి స్పందించారు. ఇన్నాళ్లూ వృథాగా లారీలకు ఎత్తి ఊరుబయటకు తీసుకెళ్లి పారబోయడమో, లేక తగులబెట్టడమో చేస్తున్న ‘ఆకు చెత్త’తో భూసారాన్ని పెంచి మొక్కలకు, పర్యావరణానికి మేలుచేసే ‘ఆకు ఎరువు’ తయారుచేయవచ్చన్న విషయం ఆయనను కొత్త పనికి పురికొల్పింది. సేంద్రియ రైతు, స్క్వేర్‌ఫుట్ గార్డెనింగ్ నిపుణుడు దేవినేని మధుసూదనరావు కూరగాయలు, ఆకుకూరలు సాగుచేస్తున్న తీరుపై ‘..అంతా ఆకు ఎరువుతోనే’ శీర్షికతో ‘ఇంటి పంట’లో వచ్చిన కథనం వెంకట్ రామ్‌రెడ్డిలో కంపోస్టు తయారీపై ఆసక్తిని రేకెత్తించింది. అదేరోజు మధుసూదనరావుకు ఫోన్ చేసి ‘ఆకు ఎరువు’ గురించి వాకబు చేశారు.

ఎండు ఆకులన్నిటినీ పారేయకుండా భద్రంగా కుప్పగా వేయమని సిబ్బందిని ఆదేశించారు(ఈ ఆదేశాన్ని అమలు చేయించడానికి మెమోలు ఇవ్వాల్సివచ్చిందట!). మధుసూదనరావు సమక్షంలో.. ఈ నెల 8వ తేదీన ‘ఆకు ఎరువు’ తయారీ కోసం పద్ధతి ప్రకారం దిబ్బను వేయించారు. ఇంత సులువుగా.. వాన పాములు కూడా అవసరం లేకుండా చక్కని ఆకు ఎరువు తయారుచేసుకోవచ్చని అర్థంచేసుకున్న ఉద్యాన శాఖ అధికారులు, సిబ్బందిలో ఉత్సాహం ఉరకలు వేసింది. మూడు వారాలకోసారి.. రెండుసార్లు.. ఈ దిబ్బను తిరగేస్తే.. 90 రోజుల్లో చక్కని ఆకు ఎరువు తయారవుతుందని మధుసూదనరావు చెప్పారు.

రోజుకు 200 కిలోల ఆకు ఎరువు
హైదరాబాద్ మహానగరంలో పబ్లిక్ గార్డెన్స్, మంత్రులు, జడ్జీల క్వార్టర్లు తమ పరిధిలో ఉన్నాయని, ఇందులో రోజూ టన్ను ఎండు, పచ్చి ఆకులతో కూడిన చెత్త వస్తుందని వెంకట్ రామ్‌రెడ్డి ‘ఇంటి పంట’ ప్రతినిధికి తెలిపారు. ఈ చెత్తను ఇక మీదట పారేసేది లేదని, దీనితో రోజుకు 200 కిలోల ఆకు ఎరువును తయారుచేసుకుంటామని ఆయన వివరించారు. తాము ఏడాదికి రూ. 4, 5 లక్షల ఖరీదైన పశువుల ఎరువు, రసాయనిక ఎరువులు కొనుగోలు చేసేవారమని, ఇకపై తామే వ్యర్థ ఆకులతో సేంద్రియ ఎరువు స్వయంగా తయారుచేసుకుంటామని ఆయన చిరునవ్వుతో చెప్పారు. అంతేకాదు.. చెత్తను ఊరవతల పారేయడానికి అయ్యే ఖర్చు కూడా ఆదా అయినట్టే కదా!

వెంకట్ రామ్‌రెడ్డి విజ్ఞతతో చూపిన చొరవ.. ఉద్యాన శాఖ పరిధిలో చెత్త నుంచి సేంద్రియ ఎరువు తయారీకి శుభారంభం పలకడం ప్రశంసనీయం. విప్లవాత్మక మార్పునకు ఇది గొప్ప ప్రారంభం. రాష్ట్రంలోని అన్ని పార్కుల్లోనూ ఇలాంటి ప్రయత్నం జరిగితే.. ఏకంగా కంపోస్టు విప్లవమే వస్తుందనడంలో అతిశయోక్తి ఏమైనా ఉందా..?

 ‘సాక్షి’ స్పెషల్ 

పెరట్లో ఆకు ఎరువు ఇలా


కంపోస్టు.. కంపోస్టు.. కంపోస్టు... విష రసాయనాలు వాడకుండా కూరగాయలు, ఆకుకూరలు ఇంటిపట్టునే పండించుకోవడానికి ఇదే అత్యవసరమైన సేంద్రియ ఎరువు. కంపోస్టు కొత్తదేమీ కాదు. మనిషి పుట్టినప్పటి నుంచీ ఉంది. అయితే, సహజ వ్యవసాయంపై ఆసక్తి పెరుగుతున్నకొద్దీ ఇటీవలకాలంలో దీని గురించి అందరూ ఆలోచిస్తున్నారు.

కంపోస్టు అంటే.. మొక్కలు చక్కగా పెరగడానికి అవసరమైన అన్ని పోషకాలూ కలిగిన మట్టిలాంటి సేంద్రియ పదార్థం. మీ అంతట మీరు పెరట్లో కొన్ని రకాల ఎండిన/పచ్చి ఆకులు అలములు, పేడ నీళ్లు కలిపి.. అప్పుడప్పుడూ తిరగేస్తూ తయారుచేసుకునే కంపోస్టే (లీఫీ మౌల్డ్ లేదా ఆకు ఎరువు) అత్యుత్తమమైనది.

కంపోస్టు మూడు రకాలు...
{పాణవాయువు సోకే పద్ధతిలో తయారుచేసిన (ఏరోబిక్) కంపోస్టు.
గాలి సోకకుండా తయారైన (ఎనరోబిక్) కంపోస్టు.
వర్మీ కంపోస్టు (వానపాములతో తయారుచేసేది).
ఏరోబిక్ పద్ధతిలో తయారైన ఆకు ఎరువు నాణ్యంగా ఉంటుంది. బరువు తక్కువ కాబట్టి.. మేడపై మడుల్లో, కుండీల్లో కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవడానికి ఆకు ఎరువు అనువుగా ఉంటుంది. ఏరోబిక్ కంపోస్టును పెరట్లో దిబ్బ వేసి తయారుచేసుకోవచ్చు. ఆకు ఎరువు తయారుచేయడం ఇలా..

నేలపైనే చెట్టు నీడన ఎరువు దిబ్బను ఏర్పాటుచేసుకోవచ్చు. దిబ్బ మరీ ఎక్కువ ఎత్తు ఉంటే బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి గాలి ఎక్కువగా చొరబడదు.
ఎరువు దిబ్బ 4 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పు, 4 అడుగుల పొడవున ఉంటే సదుపాయంగా ఉంటుంది. కావాల్సినవన్నీ సేకరించుకొని ఒకే రోజు దిబ్బ వేయాలి.

దిబ్బ వేసే చోట పలుగు/గడ్డిపారతో చిన్న గుంత తవ్వాలి. 2-3 అంగుళాల మందం ఉండి ఆరు అడుగుల పొడవు ఉండే కట్టెను గుంతలో గుచ్చాలి. ఇప్పుడు దిబ్బను కట్టె చుట్టూ ఏర్పాటుచేయాలి. దిబ్బలో గాలి బాగా ప్రసరించడానికి ఇది పొగగొట్టం మాదిరిగా పనిచేస్తుంది.
అడుగున 2 అంగుళాల మందంలో చిన్న పుల్లలు వేయాలి. దిబ్బ అడుగున నీరు నిలబడకుండా ఉండేందుకు ఇలా చేయాలి.

కూరగాయలు, ఆకుకూరల వ్యర్థాలు, 5, 6 రకాల పచ్చని ఆకులు.. ఎండు ఆకులు(వీటిని రెండు రోజులు ముందునుంచే తడిపి ఉంచుకొని దిబ్బలో వేయాలి).. ఆవు పేడ కలిపిన కళ్లాపి వాడాలి. ఇవి నత్రజనిని అందిస్తాయి.
మొక్కల వ్యర్థపదార్థాలను (పచ్చివి, ఎండువీ) సేకరించి వాటిని 1-2 అంగుళాల ముక్కలుగా కత్తిరించాలి. గట్టిగా ఉండే పెద్ద కొమ్మలు వాడకుండా ఉంటే మంచిది.

రంపపు పొట్టు, కొబ్బరిపొట్టు కొంత కలిపితే కర్బనంను అందిస్తాయి.
రాతిపొడి, కరల్రను కాల్చిన బూడిద, కోడిగుడ్ల పెంకుల పొడి, ఎముకల పొడి.. వంటి ధాతువులు కొద్ది మోతాదులో కలుపుకోవచ్చు.
వీటిని పొరలు పొరలుగా పేర్చితే దిబ్బ తయారవుతుంది. ప్రతి పొరపైనా ఆవు పేడతో తయారుచేసిన కళ్లాపిని చల్లి.. ఆపైన మరో పొర వేసుకోవాలి. కంపోస్టుకు దోహదపడే సూక్ష్మజీవులు పాడి ఆవు పేడలో ఎక్కువగా ఉంటాయి.

ఎరువు దిబ్బ మధ్యలో 60 డిగ్రీల వేడి పుడుతుంది. కంపోస్టు తయారీ ప్రక్రియ పుంజుకున్నదనడానికి ఇది సూచిక.

త్వరగా మంచి కంపోస్టు తయారవ్వాలంటే దిబ్బలో తగిన తేమ ఉండేలా చూసుకుంటూ.. రెండు మూడు రోజులకోసారి తిరగేస్తూ.. లోపలి పదార్థాలను బయటకు, బయటి పదార్థాలను లోపలికి వెళ్లేలా చూడాలి. దిబ్బ తడీపొడిగా ఉండేలా నీరు తగుమాత్రంగా చిలకరించాలి.

ఎక్కువ ఆక్సిజన్‌ను దిబ్బలోని పదార్థాలకు, సూక్ష్మజీవులకు అందించడం కోసం ఇలా చేయాలి. ఎంత ఎక్కువ ఆక్సిజన్ దిబ్బలోకి వెళితే.. అంత త్వరగా బాక్టీరియా వృద్ధిచెంది.. అంత త్వరగా కంపోస్టు సిద్ధమవుతుంది.
వంటింటి వ్యర్థాలతో నగరాల్లో, గ్రామాల్లోనూ.. ఇంటి వద్ద కూడా కంపోస్టును సులభంగా తయారు చేసుకోవచ్చు (ఇదెలాగో వచ్చే వారం తెలుసుకుందాం).
- ‘సాక్షి’ స్పెషల్ డస్క్

ఇలా చేయండి...
మొక్కల వ్యర్థాలు (పచ్చివి, ఎండువీ) 1, 2 అంగుళాల ముక్కలు చేసి మాత్రమే వాడాలి. సింథటిక్ పదార్థాలు అసలు వాడకూడదు.
దిబ్బ 4 అడుగుల ఎత్తు, 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు ఉంటే మంచిది. అంతకన్నా తక్కువ ఉన్నా, అంతకన్నా ఎక్కువ ఉన్నా ఇబ్బందే.
దిబ్బ ఎప్పుడూ తడీ పొడిగా ఉండాలి. బొత్తిగా ఎండి పోకూడదు. అలాగని.. తడిగా నీరుకారకూడదు.

రైతు బజారు వ్యర్థాలతో..
రైతు బజారులో దెబ్బతిన్న, మిగిలిపోయిన కూరగాయలు ఒకటి రెండు బస్తాలు తెచ్చుకొని.. చిన్న చిన్న ముక్కలు చేసి కంపోస్టు చేసుకునే వీలుందని విజయవాడకు చెందిన చలసాని దత్తు (94414 73246) సూచిస్తున్నారు. బేకరీ నుంచి సేకరించిన కోడిగుడ్డు పెంకుల పొడిని వినియోగించవచ్చన్నారు. ఆకులు, రంపపు పొట్టు, ఎండు మొక్కలు కొమ్మలు కాల్చిన బూడిద వాడి కంపోస్టు తయారుచేసుకోవచ్చని ఆయన తెలిపారు.

15 రోజుల్లోనే..!
కంపోస్టును 15 రోజుల్లో కూడా తయారుచేసుకోవచ్చని దేవినేని మధుసూదనరావు (99890 51200) అంటున్నారు. ఎంత త్వరగా కంపోస్టు కావాలనుకుంటే అన్ని ఎక్కువసార్లు తిరగెయ్యాలి... అంతే!
15 రోజుల్లో కంపోస్టు అవాలనుకుంటే.. దిబ్బను ప్రతి రోజూ తిరగెయ్యాలి.
90 రోజుల్లో తయారుకావాలనుకుంటే.. వారానికోసారి తిరగెయ్యాలి.
30 రోజులకోసారి తిరగేస్తే.. ఏడాది పడుతుంది!

‘ఇంటి పంట’ @ ‘సాక్షి’...
‘సాక్షి’ చేపట్టిన ‘ఇంటి పంట’ యజ్ఞంలో ఉరకలెత్తే ఉత్సాహంతో పాలుపంచుకుంటున్న పాఠకులకు అభినందనలు. మీ ‘ఇంటి పంట’ అనుభవాలు రాయండి.

ఫొటో కూడా పంపండి. సందేహాలుంటే.. సంబంధిత వివరాలన్నీ రాయండి. intipanta@sakshi.com కు ఈమెయిల్ పంపవచ్చు. ‘ఎడిటర్, ఇంటి పంట, స్పెషల్ డెస్క్, సాక్షి దినపత్రిక, 6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 500 034’ కు ఉత్తరం రాయొచ్చు. మీ పేరు, ఊరు, జిల్లా తప్పక తెలపండి.

Sunday, 20 March 2011

కూరగాయల మడి.. పెట్టుకుందామా



పట్నమైనా, పల్లె అయినా.. పెరట్లోనో, మేడ మీదో ఇంటిల్లిపాదికీ వంటకు సరిపోయే కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవాలనుకుంటే.. కొన్ని కుండీలతో పాటు ఒకటో రెండో మడులు కూడా ప్రతి ఇంటి వద్దా ఏర్పాటు చేసుకోవడం అవసరం. ఇంట్లో కూరగాయల వాడకాన్ని బట్టి ఎన్ని కుండీలు, ఎన్ని మడులు అవసరమవుతాయో ఏ కుటుంబానికి ఆ కుటుంబమే గ్రహించాలి.

అవసరమయ్యే మొత్తం ఒకేసారి పండించుకోలేకపోయినా.. వీలున్నంతలో ముందు ఒక మడి ఏర్పాటుచేసుకోవడానికి ప్రయత్నించండి. విష రసాయనాల్లేకుండా పెరిగిన ఇంటి పంట రుచి తెలిశాక.. ఇంట్లోకి పూర్తిగా సరిపోను ఇంటిపట్టునే పండించుకునే ఏర్పాటు చేసుకోవచ్చు.

మడి 4 అడుగుల వెడల్పుంటే చాలు..
పెద్ద వారికి రోజుకు 300 గ్రాముల కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూరలు అవసరం. పోషక విలువల రీత్యా దుంపలు, కూరగాయలకన్నా ఆకుకూరలే కాస్త ఎక్కువ తీసుకోవాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మడుల్లో అధిక స్థలం ఆకుకూరల పెంపకానికి కేటాయించుకోవడం ఉత్తమం. కూరగాయల మడి వెడల్పు 4 అడుగులు ఉంటే చాలు. మడి దగ్గర కూర్చొని చేయి చాపితే.. మడి అవతలి అంచు అందేలా ఉంటే చాలు. ఉన్న చోటును బట్టి మడి వెడల్పు తగ్గించుకోవచ్చు. పొడవు ఎంతైనా పెట్టుకోవచ్చు.

మేడపై మడి ఇలా..
పెరట్లో వేసే మడులకు, ఇంటిపైన పెట్టుకునే మడులకు చిన్న తేడా ఉంది. పెరట్లో (అంటే నేల మీద) ఏర్పాటు చేసుకునే మడికి.. వర్షపు నీటి కోత నుంచి ప్రత్యేక రక్షణ అవసరం. మేడ మీద పాలిథిన్ షీట్ పరిచి.. దానిపై చుట్టూ మూడు వరుసలు ఇటుకలు పేర్చి.. మట్టి, కంపోస్టు తదితరాలతో ప్రత్యేకంగా సిద్ధంగా చేసుకున్న మట్టి మిశ్రమాన్ని పోస్తే.. మడి సిద్ధమైనట్టే.

పెరట్లో మడి ఇలా..
పెరట్లో మడిని ఏర్పాటు చేసుకునే స్థలాన్ని గుర్తించిన తర్వాత.. ఆ స్థలంలో ఇటుకలను బల్లపరుపుగా పరవాలి. ఆ ఇటుకల పైన.. చుట్టూ అంచుల్లో ఒక వరుస ఇటుకలు పేర్చాలి.

ఆ ఇటుక మేరకు 3 అంగుళాల మందాన మామూలు మట్టి పోయాలి(ఈ మట్టి మడి అడుగున దన్నుగా ఉండడానికి మాత్రమే. అందులో మొక్కలు వేసేదేమీ ఉండదు. ఆపైన వేసే మట్టి మిశ్రమంలోనే మొక్కలను సాగు చేస్తామన్న మాట). ఆ మట్టిపైన పాలిథిన్ షీట్ పరవాలి. వర్షపు నీరు ఉధృతంగా మడి సమీపంలో పారినా.. మడి అడుగున మట్టి కోసుకుపోకుండా ఈ ఏర్పాటు చేసుకోవాలి. అలా పరచిన పాలిథిన్ షీట్‌పై చుట్టూ అంచుల్లో రెండు వరుసలు ఇటుకలు పేర్చాలి. మధ్యలో మట్టి మిశ్రమాన్ని పోస్తే.. పెరట్లో మడి సిద్ధమైనట్టే.

ఇటుకలే వాడాలనేం లేదు..
కొందరు ఇటుకలకు బదులు పల్చని చెక్కలు, బంగళా పెంకులు, నాపరాళ్లు.. ఏవి అందుబాటులో ఉంటే వాటిని అమర్చుకొని కూరగాయల మడులు సిద్ధం చేసుకుంటున్నారు. మనం ఏ మెటీరియల్ వాడినా.. నేలపై ఏర్పాటు చేసుకునే మడికి అడుగున వర్షపు నీటి ఉధృతిని తట్టుకునేలా ప్రత్యేక జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. మేడపై మడికి అడుగున పాలిథిన్ షీట్ వేస్తే చాలు. అడుగున గచ్చు ఉంటుంది కాబట్టి... అడుగున మట్టి కోసుకుపోవడమనే సమస్య మేడపై మడికి ఉండదు.

పాలిథిన్ షీట్‌కు బెజ్జాలు పెట్టాలి..
మడిలో మట్టి మిశ్రమానికి అడుగున వేసే పాలిథిన్ షీట్‌కు ముందుగానే అక్కడక్కడా దబ్బళంతో బెజ్జాలు పెట్టాలి. ఈ బెజ్జాలు ఎందుకంటే.. మడిలో మొక్కలకు తగు మాత్రంగా పోస్తే చాలు. మడిలో నీరు నిల్వ ఉంటే మొక్కలకు ముప్పు పొంచి ఉన్నట్టే. నీరు మడిలో ఏమాత్రం నిలబడిపోకూడదు. మిగిలిపోయే నీరు ఎప్పటిది అప్పుడు కిందికి వెళ్లిపోయే ఏర్పాటు.. కుండీకైనా.. మడికైనా ప్రాణావసరం. పాలిథిన్ షీట్‌కు జానకు ఒక చోట దబ్బళంతో బెజ్జం పెడితే సరిపోతుంది.

రెండేళ్ల వరకూ మడికి ఖర్చేమీ ఉండదు..
ఎరమ్రట్టి, కంపోస్టు (లీఫీ మౌల్డ్.. అంటే ఆకు ఎరువు లేదా వర్మీ కంపోస్టు), కొబ్బరి పొట్టు, వర్మిక్యులైట్, వేప పిండి.. తగిన పాళ్లలో కలుపుకొని మట్టి మిశ్రమాన్ని సిద్ధం చేసుకొని మడిలో వినియోగించాలి. రెండేళ్ల వరకూ ఈ మట్టి మిశ్రమంలో వరుసగా పంటలు పండించుకోవచ్చు. సకల పోషకాలు పుష్కలంగా ఈ మట్టి మిశ్రమంలో ఉంటాయి. కాబట్టే, మామూలు మట్టిలో కన్నా.. మట్టి మిశ్రమంలో పెరిగే మొక్కలు కనీసం 3 రెట్లు పంట దిగుబడులు వస్తాయి.
(శుక్ర, శనివారాల్లో ఇక్కడే కలుద్దాం...)
- ‘సాక్షి’ స్పెషల్ డెస్క్

అద్దె ఇల్లయితే నేం


అందుబాటులో ఉండే వ్యర్థాలతో కంపోస్టు చేసి.. అందులో మొక్కలు పెంచుతున్నారు సికింద్రాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన చింతకాయల వెంకట నారాయణమ్మ. ఇంటి వద్దనే కుండీల్లో కేవలం ఆసక్తే పెట్టుబడిగా సేంద్రియ పద్ధతుల్లో ఆమె కూరగాయ మొక్కలు పెంచడం చూస్తే ముచ్చటేస్తుంది. కుండీలో నిమ్మ మొక్క చక్కగా 50,60 కాయలు కాస్తున్నది. నిమ్మకాయ వాసన, నాణ్యతలో బయటకొన్న నిమ్మకాయలు దిగదుడుపేనని ఆమె చెప్పారు. నారాయణమ్మ, వెంకటేశ్వర్లు దంపతులు పదేళ్లుగా సికింద్రాబాద్‌లోని ఉప్పల్ ప్రశాంత్‌నగర్‌లో అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నారు. నారాయణమ్మకు మొక్కల పెంపకం అంటే మహాప్రీతి. అద్దె ఇంట్లో మేడపై వాటాలో అద్దెకు ఉంటున్నప్పటికీ ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో కుండీలు పెట్టి కాకర, తమలపాకు, గోరింటాకు వంటి ఇతరత్రా మొక్కలతో పాటు చింత మొక్కలను కూడా పెంచడం విశేషం. ఏటా అనేక సార్లు పప్పులోకి చింత చిగురు దొరుకుతోందని ఆమె చెప్పారు.

వాడిన టీపొడి, కూరగాయల తొక్కలు, దేవుడి వద్ద ఎండిపోయిన పువ్వులు, పండ్ల తొక్కల వంటి కుళ్లే స్వభావం ఉన్న వ్యర్థపదార్థాలను చెత్తబుట్టలో పారెయ్యకుండా.. ఏ పాత డబ్బాలోనో, కుండీలోనో వేయడం... ఆ డబ్బా నిండిన తర్వాత ఏదో ఒక మొక్క పెట్టడం ఆమెకు అలవాటు. అడుగు ఎత్తున్న ధర్మాకోల్ డబ్బాల్లో నారాయణమ్మ కొన్ని మొక్కలు పెంచుతున్నారు. కుమారుడు తన లేబొరేటరీ కోసం తెప్పించే టెస్టింగ్ కిట్లతోపాటు వచ్చే ధర్మాకోల్ డబ్బాలను పారెయ్యకుండా మొక్కలు పెంచడానికి వినియోగిస్తున్నారు.


అంతేకాదు, లాబ్‌కు పరీక్షల కోసం వచ్చే మట్టిని పని పూర్తయ్యాక.. ఒక బస్తాలో జాగ్రత్త చేసి.. ఆ మట్టినే కంపోస్టుతో కలిపి కుండీల్లో వాడుతున్నారు. అద్దె ఇల్లు మొదటి అంతస్థులో ఉంటున్నారు గదా ఇన్ని మొక్కల కుండీలతో ఇబ్బందులేమీ రాలేదా అంటే.. పదేళ్లలో ఎటువంటి ఇబ్బందీ రాలేదని ఆమె నవ్వుతూ చెప్పారు. వేసవిలోనో.. ఏదో ఒక సందర్భంలోనే ఇంట్లో అందరూ ఊరెళ్లాల్సి వస్తే మొక్కల్ని ఎవరు చూస్లారు? ఇరుగు పొరుగు వారు ఎవరో ఒకరు చూస్తారని, అదెప్పుడూ సమస్య అనిపించలేదని చెప్పారు. 

కుండీలు సిద్ధం చేస్తున్నారా


కుండీ అడుగున కుండ పెంకులు.. ఎండు ఆకులు.. ఇసుక వేసిన తర్వాత మట్టి మిశ్రమం పోయాలి
నీరు నిలవ లేకుండా చూసుకోవాలి
కంపోస్టు, తదితరాల కన్నా
మట్టి తక్కువ వాడితేనే అధిక దిగుబడి

మూడు వారాల నుంచి మనం ‘ఇంటి పంట’లో అనేక విషయాలు మాట్లాడుకున్నాం గదా.. ఇంటిపట్టున కూరగాయలు, ఆకుకూరలు పెంచుకోవడానికి సిద్ధమవుతున్నారా? మేడ మీదో, పెరట్లోనో కుండీలు ఏర్పాటుచేసుకోవడానికి అవసరమైనవన్నీ సమకూర్చుకుంటున్నారా? మరికొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందామా మరి.. కుండీలు ఏర్పాటు చేసుకునేటప్పుడు కొన్ని మెలకువలు పాటిస్తే మొక్కల పోషణలో సమస్యలు ఎదురవకుండా చూసుకోవచ్చు.

మట్టి మిశ్రమం ఇలా..
కుండీల్లో కూరగాయలు, ఆకుకూరలు పెంచుకోవడానికి సిద్ధం చేసుకునే మట్టి మిశ్రమం ఎలా ఉండాలి? కచ్చితంగా ఇలాగే ఉండాలన్న నియమం ఏమీ లేదు. కానీ, ఎర్ర మట్టి వాడితే గట్టిపడిపోకుండా ఉంటుంది. నల్లమట్టి వాడాల్సి వస్తే.. గట్టిపడే స్వభావం నల్లమట్టికి ఎక్కువ కాబట్టి మట్టి పాళ్లను తగ్గించాలి. ఇసుకను కూడా కొంత మేరకు వాడాలి. ఇక కంపోస్టు.. ఆకు ఎరువు (లీఫీ మౌల్డ్), వర్మీ కంపోస్టులలో దేన్నయినా వాడొచ్చు.
ఆకులు అలములపై పశువుల పేడ నీటిని చల్లి ఆకు ఎరువును తయారుచేస్తున్నారు. కొన్ని మార్పులతో పాటు వానపాములు వాడి వర్మీ కంపోస్టు తయారుచేస్తున్నారు. మడుల ఏర్పాటుకు ఈ రెంటినీ వివిధ పాళ్లలో వాడుతున్న వాళ్లున్నారు. ఆకు ఎరువును అధిక పాళ్లలో వాడుతున్న వాళ్లున్నారు. పూర్తిగా ఆకు ఎరువునే వాడుతూ మామూలుకన్నా మూడు రెట్లు ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు పెంచుతున్న వాళ్లూ ఉన్నారు.
గింజల పిండి..

వేప, కానుగ, శీతాఫల, ఆముదం గింజల పిండిని తగుమాత్రంగా మట్టి మిశ్రమంలో కలపడం ద్వారా చీడపీడలను నివారించవచ్చు. అదనపు పోషకాలు కూడా మొక్కలకు అందుతాయి. కొబ్బరి పొట్టు లేదా రంపపు పొట్టును కూడా కలుపుతున్నారు. మట్టిని వదులుగా ఉంచి మొక్కలు కుచ్చులు కుచ్చులుగా వేళ్లుపోసుకోవడానికి ఇవి దోహదపడతాయి. కొబ్బరి పొట్టు మట్టికన్నా 8 రెట్లు అధికంగా నీటిని పట్టి ఉంచుతుంది. వర్మిక్యులైట్‌ను కూడా కలుపుతున్నారు. ఇది మైకా గనుల వద్ద లభించే వ్యర్థ పదార్థం. ఇది తేమ ఆరిపోకుండా చూస్తుంది. కాబట్టి వేసవి కాలంలో వీటి అవసరం ఎక్కువ. నీటి వృథా బాగా తగ్గుతుంది.

ఎరమ్రట్టి 1పాళ్లు, ఆకు ఎరువు 4, వర్మీ కంపోస్టు 2, వర్మిక్యులైట్ 1, కొబ్బరి పొట్టు 1 పాళ్లలో వాడి మట్టి మిశ్రమాన్ని తయారుచేసుకోవచ్చు. తక్కువ స్థలంలో పెంచుకుంటున్నాం కాబట్టి.. మట్టి పాళ్లు తక్కువగావాడి.. ఇతర పదార్థాలను అధిక పాళ్లలో వాడడం మంచిది. వర్మిక్యులేట్ అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. కొబ్బరి పొట్టు అందుబాటులో ఉంటుంది. లేదంటే.. రంపపు పొట్టయినా దొరుకుతుంది. మూడింటిలో ఏదో ఒకటైనా ఉండేలా చూసుకుంటే మంచిది. ఇవి దొరకని పరిస్థితుల్లో సగానికి పైగా ఎరమ్రట్టి కలుపుకోవచ్చు.

నీరు నిల్వ ఉంటే మొక్కలకు హాని
కుండీల్లో గాని, మడుల్లో గాని మొక్కలు సక్రమంగా పెరగడానికి తగుమాత్రంగానే నీరు పోయాలి. వాతావరణంలో వేడిని బట్టి ఎంత అవసరమో చూసుకొని ఏర్పాట్లు చేసుకోవాలి. కుండీలో మట్టి ఎప్పుడూ తగుమాత్రంగా తడిగా ఉండేలా చూసుకోవాలి. నీరు నిల్వ ఉండిపోకూడదు. అలాగని మట్టి తడి ఆరిపోకూడదు. ఎప్పుడూ తడీ పొడిగా ఉండాలన్న మాట. ఎక్కువైన నీరు కిందికి ఎప్పటిదప్పుడు దిగిపోయేలా జాగ్రత్త తీసుకోవాలి.

కుండీల బెజ్జాలు పూడిపోకుండా...
కుండీలకు అడుగు భాగాన విధిగా బెజ్జాలు ఉండేలా చూసుకోవాలి. రెండు మూడు బెజ్జాలు ఉండాలి. అంతేకాదు. అవి పూడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం.. కొన్ని పెంకు ముక్కలు లేదా కొబ్బరి చిప్ప ముక్కలు, చిన్న చిన్న రాళ్లు వంటి గట్టిగా ఉండేవాటిని ఎగుడు దిగుడుగా వేసి మధ్యలో ఖాళీలు ఉండేలా చూడాలి. వాటిపైన అంగుళం మందాన ఎండు ఆకులు పరవాలి. ఆపైన అంగుళం మందాన ఇసుక పోయాలి.

తర్వాత మట్టి, కంపోస్టు తదితరాల మిశ్రమాన్ని పోస్తే కుండీ సిద్ధమైనట్టే. అల్యూమినియం టబ్‌లలో ఆకుకూరలు, కూరగాయలు పెంచుతున్న వారు అడుగున అంగుళం మందాన కొబ్బరి పీచును వాడుతున్నారు. నీరు పోవడానికి అనువుగా ఉండడమే కాకుండా మొక్కల వేళ్లకు వేడి తగలకుండా చూడడానికి కొబ్బరి పీచు ఉపయోగపడుతోంది. తర్వాత కాలంలో కూడా.. ఎక్కువైన నీరు దిగిపోతున్నదీ లేనిదీ గమనిస్తుండాలి. నీరు పోతున్నట్టు లేకపోతే.. కుండీపై నుంచి పుల్లను బెజ్జంలోకి గుచ్చి.. ఎక్కువైన నీరు బయటకు పోవడానికి దారి ఏర్పాటుచేయాలి.

- ‘సాక్షి’ స్పెషల్ 

మేడపైన 13 మడులు


కాంక్రీటు జంగిల్‌గా మారిన నగరంలో నివసిస్తున్నా ఈ కుటుంబం గత కొన్నేళ్లుగా కూరగాయలు కొనడం లేదు! సొంత పొలంలో పండిన కూరగాయలు తెప్పించుకొని తింటున్నార నుకునేరు.. కాదు. విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న తమ మేడపై కప్పును పూర్తిస్థాయి వ్యవసాయ క్షేత్రంగా మార్చేశారు! ఆశ్చర్యంగానే ఉన్నా.. ఇది నిజం! ఆ కుటుంబ పెద్ద చలసాని దత్తు(79).

ఆయన భార్య విజయలక్ష్మి ప్రతిరోజూ దాదాపు రెండు గంటలపాటు తమ మేడపైన ఉన్న కూరగాయల తోటలో గడుపుతారు. పురుగు కనపడితే ఆ ఆకునో, రెమ్మనో తుంపి నాశనం చేస్తారు.

మనోల్లాసంతోపాటు.. కాస్మిక్ ఎనర్జీ లభిస్తుందని దత్తు అన్నారు. వృద్ధాప్యంలోనూ తాము ఆరోగ్యంగా ఉండడానికి... ఇంటిపైనే స్వయంగా పండించుకు తింటున్న సేంద్రియ కూరగాయలే కారణమని ఆయన సంతోషంగా చెప్పారు. అమెరికాకు చెందిన మెల్‌బర్తోలోమి ప్రచారంలోకి తెచ్చిన ‘స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్’ (www.squarefoot gardening.com) పద్ధతిని అవసరమైన మార్పులు చేసుకొని దత్తు దంపతులు అనుసరిస్తున్నారు. ఆయన అభిప్రాయాలు ఇవి..
మేడపై కూరగాయల మడులు అనగానే.. ఒకటో రెండో అనుకుంటాం. కానీ 13 మడులు ఏర్పాటు చేశారు. మేడ మెట్లెక్కితే.. కూరగాయల తోటలోకి అడుగుపెట్టినట్టు ఉంటుంది!
160 చదరపు అడుగుల విస్తీర్ణంలో మడులు పెట్టుకుంటే ఇద్దరు పిల్లలు, ఇద్దరు పెద్దలకు పూర్తిగా కూరగాయలు, ఆకుకూరలు పుష్కలంగా సరిపోతాయి.
టమాటా, వంగ, బెండ, క్యారట్, గోరుచిక్కుడు, గోంగూర సహా అన్ని ఆకుకూరలు, కొత్తిమీరతో పాటు.. కంది మొక్కలు కూడా పెంచుతున్నారు. కంది కాయల్లో గింజలు గట్టిపడిన తర్వాత కోసి చిక్కుడు మాదిరిగా కూర వండుకుంటున్నారు.
ఆరు అంగుళాల కంపోస్టు మడిలోనే కంది మొక్కలు పది అడుగుల ఎత్తు పెరిగి మంచి దిగుబడి ఇస్తున్నాయి.
ఇవి ప్రతి ఏటా తీసేయాల్సిన వంగడం కాదు. ఇక్రిశాట్ తయారుచేసిన ప్రత్యేక రకం. సీజన్ రాగానే పూత వచ్చి కాపు కాస్తుంది.
4 అడుగుల వెడల్పు, 4 అడుగుల పొడవు ఉండే ఇటుకల మడుల్లో అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. పాలిథిన్ షీట్ పరచి.. చుట్టూ రెండు వరుసల ఇటుకలు పేర్చి.. 80 కిలోల కంపోస్టు పోసి కూరగాయలు సాగుచేస్తున్నారు. కంపోస్టుకు కొంత వర్మిక్యులైట్ తప్ప మరేమీ కలపడం లేదు.

మేడపై మడుల్లో మట్టిని అసలు వాడకూడదు. మట్టి నీటిని పట్టి ఉంచుతుంది. దాని వల్ల మేడ శ్లాబ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది.
కంపోస్టు నీటిని పట్టి ఉంచదు. మనం నీరు పోసినప్పుడు ఎక్కువైన నీటిని కిందకు వదిలేస్తుంది. కంపోస్టు బరువు తక్కువ. వేళ్లకు ప్రాణవాయువు బాగా అందుతుంది. కాబట్టి చెట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
కుండపోత వానలు కురిసినా కంపోస్టు మడిలో నుంచి కొట్టుకుపోదు. పడిన నీరు కిందికి వెళ్లిపోతుంది.

పాత టైర్లను కూడా తగిన విధంగా అమర్చి మొక్కలు పెంచుతున్నారు.
అన్ని మడుల్లోనూ ఒకేసారి కాకుండా.. వరుస క్రమంలో పంటలు పండిస్తున్నారు. ఏడాది పొడవునా కూరగాయలకు లోటుండడం లేదు. పదేళ్లుగా కూరగాయలు కొనాల్సిన అవసరం రాలేదు.

వరిని ప్రయోగాత్మకంగా పండించారు. చక్కటి దిగుబడి వచ్చింది. వరిలోనూ నీరు నిల్వచేయనక్కర్లేదు. మడి తడీపొడిగా ఉంటేచాలు.
మాటిమాటికీ నేల తిరగబెట్టాల్సిన అవసరమూ ఉండదు. ఫోర్క్, పలుగు, పార వంటి పరికరాలతో పని లేదు. చీడ పీడలకు అవకాశం ఉండదు. కాబట్టి ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడేపనీ లేదు.
కంపోస్టు వేరు. వర్మి కంపోస్టు వేరు. వర్మి కంపోస్టులో కొంత మట్టి కలిపితేనే మొక్క బతుకుతుంది. నేల మీద వర్మి కంపోస్టుతో మొక్కలు పెంచవచ్చు.
కంపోస్టును కూరగాయల వ్యర్థాలు, ఆవుపేడ నీళ్లు, బూడిద.. తదితరాలు వాడి నేలపై 90 రోజుల్లో తయారుచేయవచ్చు. ఇళ్ల దగ్గరయితే.. రోజూ తిరగేస్తూ.. నెల రోజుల్లో కూడా కంపోస్టు తయారుచేయవచ్చు.

కంపోస్టులో కొత్తిమీర మొక్కలున్న మట్టి పాత్రను అతిథులకు బహూకరిస్తూ.. ఇంట్లోనే పండించుకోవడాన్ని అలవాటు చేస్తున్నారు.
సూక్ష్మ పోషకాలు కూడా పుష్కలంగా ఉండే సేంద్రియ కూరగాయలను ఇంటిపట్టున పండించుకోవాలంటే... బలమైన పూనిక ఉండాలి.
సేంద్రియ కూరగాయలు ప్రాణావసరంగా గ్రహించి.. పూనుకోవాలి. పూనిక ఉంటే.. ఆటంకాలను అధిగమించడం సమస్యే కాదు!
- న్యూస్‌లైన్, విజయవాడ (సీతారామపురం)

సందేహాలున్నాయా..?
విజయవాడ నడిబొడ్డున మేడపైనే అనేక సంవత్సరాలుగా కూరగాయలు పెంచుతున్న చలసాని దత్తును 0866- 2473246, 94414 73246 నంబర్లలో సంప్రదించవచ్చు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకూ, సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్య ఆయనకు ఫోన్ చేయొచ్చు.

విత్తనాలను ఆవు పంచకంలో నానబెడితే మంచిది...!
ఏ గింజనైనా ఎక్కువ లోతులో పెట్టకూడదు. గింజ పరిమాణానికి ఒకటిన్నర పరిమాణం లోతులో నాటితే చాలు. అప్పుడే మొలకొస్తుంది. గో పంచకంలో ఒక రోజు నానబెట్టి, తర్వాత నీడలో ఆరబెట్టి.. నాటినా మంచిదే. అలాగని ఆరుబయట ఎండబెట్టకూడదు.

ఒక్క మొక్క చాలు..
చదరపు అడుగు స్థలంలో లేదా కుండీలో ఒక్క గింజ / మొక్క నాటితే చాలు. రెండు మూడు నాటాల్సిన అవసరం లేదు. రెండు, మూడు మొక్కలు మొలిచినా... అక్కడ ఒక్కదాన్నే ఉంచి.. మిగిలిన వాటిని మరో చోటికి మారిస్తే.. అన్ని మొక్కలూ ఏపుగా పెరుగుతాయి.

మేడపైనే కొన్ని కుండీలు.. ఆకుకూరల మడి


- సికింద్రాబాద్‌లో ఓ కుటుంబం ప్రత్యేకత
మహానగరంలో నివసించేవారు సైతం కొంచెం శ్రద్ధ ఉంటే చాలు ఆకుకూరలు, కూరగాయలను ఇంటి వద్దే పండించుకోవడం ఆరోగ్యదాయకమని అంటున్నారు రామిశెట్టి మురళి, రమా జ్యోతి దంపతులు వరంగల్ జిల్లాకు చెందిన మురళి సికింద్రాబాద్‌లోని ఉప్పల్ ప్రశాంత్ కాలనీలో స్థిరపడ్డారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులతోపాటు కలుషిత వ్యర్థ నీటిని వినియోగించి పండిస్తున్న ఆకు కూరలు, కూరగాయలను మార్కెట్లో కొనుక్కొని తినడం ఆరోగ్యానికి హానికరమని గ్రహించి ఇంటి వద్దే సేంద్రియ సేద్యానికి ఉపక్రమించారు. స్వగృహంపైనే కొన్ని కుండీలతోపాటు ప్రత్యేకంగా ఆకుకూరల మడిని ఏర్పాటు చేసి.. కొనాల్సిన అవసరం లేకుండా.. పుష్కలంగా పండిస్తున్నారు.

వంగ, బెండ, టమాటా, చిక్కుడు...
ఇంటికి దగ్గర్లోనే ఉన్న ఖాళీ స్థలంలో కూడా వంగ, బెండ వంటి కూరగాయ మొక్కలు, ఉసిరి, దానిమ్మ, జామ తదితర ఫల వృక్షాలను పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తోటకూర, పాలకూర, చుక్కకూర, టమాటా, చిక్కుడు, దోస, మిరప, కొత్తిమీర, పుదీన, కరివేపాకు, ఉల్లి బొందులు లేదా ఉల్లి కాడలు, గుమ్మడి తదితర పంటలు పండించుకుంటున్నారు. కొన్ని పూల మొక్కలు కూడా చక్కగా పెరుగుతున్నాయి. పాలకూర పెరిగినంత వేగంగా చుక్కకూర పెరగడం లేదన్నారు. ఎరమ్రట్టిలో కొంత మేరకు వర్మీ కంపోస్టు కలిపి మొక్కలు పెంచుతున్నామని మురళి తెలిపారు. గత మూడు నెలల్లో ఆకు కూరలు, టమాటాలు, కొత్తిమీర, పుదీన కొనాల్సిన అవసరం తమ (నలుగురు) కుటుంబానికి రాలేదన్నారు. వీటిని ఇరుగుపొరుగువారు, స్నేహితులు, బంధువులతో కూడా పంచుకుంటున్నామని, ఇది చాలా సంతృప్తినిస్తోందని రమాజ్యోతి అన్నారు. ప్రతి కుండీలోనూ రెండు మూడు రకాలను సాగుచేస్తున్నారు.

వంటింటి వ్యర్థాలతోనే కంపోస్టు
కంపోస్టు ఎరువును మొదట్లో కొన్నారు. ఆ తర్వాత ఇంట్లోనే కుళ్లడానికి అవకాశం ఉన్న వ్యర్థపదార్థాలతో కంపోస్టును తయారుచేస్తున్నారు. వంటింట్లో చెత్త కోసం రెండు పాత్రలు పెట్టారు.

కుళ్లడానికి అవకాశం ఉన్న కూరగాయల పండ్ల తొక్కలు, పుచ్చకాయ ముక్కలు, ఆకులు అలములు, వాడిన టీపొడి, పుచ్చిన, పాడైన కూరగాయలు వంటి వ్యర్థ ఘన పదార్థాలన్నీటినీ ఒక పాత్రలో వేస్తున్నారు. వీటిని ఇంటి బయట మూలన ఏర్పాటుచేసిన పాత బక్కెట్‌లో వేస్తున్నారు.

క్రమంగా అదే కుళ్లి కంపోస్టుగా మారుతోందని, నెలకోసారి తీసి మొక్కల కుండీల్లో వేస్తున్నామని మురళి చెప్పారు. పప్పులు, బియ్యం కడిగిన నీళ్లు వేరే బక్కెట్‌లో పోసి ఏరోజుకారోజు మొక్కలకు పోస్తున్నారు. చెత్తను కంపోస్టుగా మార్చుతూ.. ఆ ఎరువుతో మొక్కలు పెంచుతున్నారు. పాత స్నానపు తొట్టె ఏదైనా దొరికితే కంపోస్టు బెడ్‌ను మేడ మీద నీళ్ల ట్యాంకు అడుగున ఏర్పాటు చేద్దామనుకుంటున్నామని మురళి అన్నారు.

రసాయనాలు వాడలేదు
చిక్కుడుకు పేను సోకితే రసాయనిక పురుగుమందులు వాడలేదని, వావిలాకు కషాయం చల్లామన్నారు. వేప చెక్క(నీమ్ కేక్)ను రోజంతా నానబెట్టి ఆ కషాయాన్ని మొక్కలపై చల్లితే మట్టి ద్వారా వచ్చే తెగుళ్లు పోతాయని, మొక్కకు పోషకాలు కూడా అందుతాయని అన్నారు.

మేడపై మడితో ఇబ్బందేమీ లేదు
మేడపైన 4 అడుగుల వెడల్పు, 15 అడుగుల పొడవు గల ఆకు కూరల మడిని మురళి, రమాజ్యోతి దంపతులు ఏర్పాటు చేసుకున్నారు. చుట్టూ రెండు ఇటుకల ఎత్తున (6 అంగుళాలు) సిమెంటుతో కట్టించి.. ఎరమ్రట్టి మూడొంతులు, ఒక వంతు వర్మి కంపోస్టు, కొద్ది మొత్తంలో వేప పిండి కలిపి మడిని ఏర్పాటుచేశామని మురళి చెప్పారు.

వర్షాకాలంలో ఈ మడి వల్ల ఇంటి స్లాబ్ నుంచి గదిలోకి ఏమైనా ఊట దిగడం వంటి సమస్యేమీ రాలేదన్నారు. మడి అడుగున ప్లాస్టిక్ షీట్ కూడా వేయలేదన్నారు. శ్లాబ్ సాధారణంగా 6 అంగుళాల మందానే వేశామన్నారు. మడిలో మూడు నాలుగు రకాల ఆకు కూరలు సాగుచేస్తున్నారు. ప్రతి ఆకుకూర నాలుగు రోజులకోసారి కోతకొస్తున్నాయని, చెట్టును పీక కుండా పెరిగిన ఆకులను తెంపుకుంటున్నామని రమాజ్యోతి చెప్పారు. ఒకసారి విత్తనాలు వేస్తే మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుందన్నారు.

గజం స్థలంలో 288 మొక్కలు


ఇది ‘పెరటి మొక్కల పొద’ మ్యాజిక్
ముచ్చటగొలుపుతున్న ‘పెరటి మొక్కల గోడ’!
అర్బన్ కిచెన్ గార్డెన్‌కు
అధునాతన అన్‌బ్రేకబుల్ కుండీల సొబగు

నాలుగు కూరగాయ మొక్కలో, ఆకుకూరలో ఇంటి పట్టున పెంచుకుందామంటే పెద్దగా చోటు లేదని చింతిస్తున్నారా? బాల్కనీలో ఉన్నదల్లా రెండు గజాల స్థలమే. ఆ కాస్త ఖాళీలో ఎన్ని కుండీలు పెట్టగలం.. ఎంతని ఆకుకూరలు పెంచగలం అననుకుంటున్నారా..?

ఇదుగో చక్కటి ఉపాయం... వర్టికల్ పెరటి తోట!
అరకిలో బరువుండే చిన్న చిన్న ప్లాస్టిక్ కుండీలు ఉంటాయి. వాటిని పట్టి ఉంచడానికి కొన్ని ప్లాస్టిక్ ఫ్రేమ్‌లు ఉంటాయి. వీటిని ఉపయోగించి ఎవరికి వారు ‘పెరటి మొక్కల పొద’ (బయో వాల్)లను, ‘పెరటి మొక్కల గోడ’ (గ్రీన్ వాల్)లను పదంటే పది నిమిషాల్లో సృష్టించుకోవచ్చు.
ఆకారం, ఎత్తు, పొడవు, వెడల్పు.. ఎలా కావాలంటే ఆ విధంగా కుండీలను అమర్చుకునే వీలుంది. గుండ్రంగా పొద మాదిరిగా ఫ్రేమ్స్‌ను కలిపి, చుట్టూ ప్లాస్టిక్ కుండీలు తగిలించవచ్చు. లేదంటే ప్లైవుడ్‌కు ఈ ఫ్రేమ్స్‌ను కోరిన వెడల్పు, ఎత్తు, పొడవులలో సులువుగా బిగించుకోవచ్చు. తర్వాత చిటికెలో కుండీలు తగిలించవచ్చు.

వారానికో, నెలకో.. మీకు తోచినప్పుడు ఈ ఫ్రేమ్స్‌ను మార్చి.. మీ అత్యాధునిక పెరటి తోటకు పది నిమిషాల్లో కొత్త రూపు దిద్దుకోవచ్చు. ఈ మార్పులన్నీ నిపుణులెవరో వచ్చి చెయ్యక్కర్లేదు. ఫ్రేమ్‌ల అమరికను ఒక్కసారి పరికించి చూస్తే చాలు.. ఎవరికివారే పెరటి తోటను బిగించుకోవచ్చు!
అన్నిటికీ మించి.. ప్రస్తుతం కొద్ది రోజులు ఏ పెరటి తోటా వద్దు అనుకుంటే... ఫ్రేమ్‌లను, కుండీలను తీసేసి.. ప్యాక్‌చేసి అటకపై దాచిపెట్టుకోవచ్చు. మళ్లీ ఎప్పుడంటే అప్పుడు పది నిమిషాల్లో బిగించుకొని.. ఆకుకూరల విత్తనాలో, కూరగాయల విత్తనాలో చల్లుకోవచ్చు. మధ్యలో పూలమొక్కలూ పెట్టుకోవచ్చు.

సులువుగా మార్చుకోవచ్చు
ఇంటి పెరటిలోనో, ఇంటి పైనో, అపార్ట్‌మెంట్ల బాల్కనీల్లో.. ఎక్కడ అవసరమైతే అక్కడ ఈ బయో వాల్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటి హాల్‌లో (నీడ పట్టున) అందంగా ‘ఫ్రేమ్ గార్డెన్’ను గోడకు వేలాడదీయొచ్చు. అటువంటి ఫ్రేమ్‌లు మరి కొన్నిటిని ఆరుబయటో, బాల్కనీల్లోనో (ఎండ తగిలే చోట) ఏర్పాటు చేసుకోవచ్చు. మూడు రోజులు నీడ పట్టున ఫ్రేమ్‌లకు ఉన్న మొక్కల కుండీలను ఎండ తగిలే చోటుకు తరలించి.. ఎండ తగిలే చోట ఫ్రేమ్‌లకు ఉన్న మొక్కల కుండీలను నీడపట్టున ఫ్రేమ్‌లకు అతి సులువుగా తగిలించుకోవచ్చు.

ముంబైకి చెందిన జేకేడీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ఈ సరికొత్త ఆలోచనతో అర్బన్ గార్డెనింగ్ గ్రీన్ వాల్‌కు రూపకల్పన చేసింది. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఉద్యాన ఎక్స్‌పోలో ఈ ఫ్లెక్సిబుల్ వర్టికల్ గార్డెన్ సిస్టమ్స్‌ను దేశంలోనే మొట్టమొదటి సారిగా జేకేడీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ప్రదర్శించింది.

6 అంగుళాల కుండీ!
అర్బన్ గార్డెనింగ్ గ్రీన్ వాల్‌లో ఫ్రేమ్‌కు అమర్చే కుండీ చేతిలో అమిరిపోయేంత చిన్నది. దీని లోతు 6 అంగుళాలు, వెడల్పు 4 అంగుళాలు. మట్టి, మొక్కతో కలిపి ఒక్కో కుండీ బరువు అర కేజీకి మించదు. ఒక్కో ఫ్రేమ్‌కు 3 కుండీలుంటాయి. అటువంటి ఫ్రేమ్‌లను ఎట్లా కావాలంటే అట్లా అమర్చుకోవచ్చు.

కొబ్బరి పొట్టు ఎరువు బెస్ట్
శుద్ధిచేసిన కొబ్బరి పొట్టు ఎరువును వాడి నిక్షేపంగా మొక్కలు పెంచుకోవచ్చునని కోనసీమలో నర్సరీల వాళ్లు అనుభవపూర్వకంగా చెప్తున్నారు. కొన్ని కంపెనీలు శుద్ధిచేసిన కొబ్బరి పొట్టు ఎరువును మార్కెట్లో విక్రయిస్తున్నాయి కూడా.

గజం వర్టికల్ గార్డెన్‌లో 288 మొక్కలు..!
ఒక్కో ఫ్రేమ్ (3 ఖాళీ కుండీలతో కలిపి) 570 గ్రాముల బరువు ఉంది. కొబ్బరి పొట్టులో చిన్న మొక్కను ఉంచిన తర్వాత ఒక్కో ఫ్రేమ్ బరువు కిలోన్నర ఉంది. అంటే మొక్క ఉన్న ఒక్కో కుండీ బరువు అర కేజీ అన్నమాట. 4 ఫ్రేమ్‌లను (అంటే 12 మొక్కలను) అమర్చేందుకు 3 అడుగుల స్థలం సరిపోతుంది. 16 ఫ్రేమ్‌లను గుండ్రంగా అమర్చి.. వాటిపై 6 వరుసలుగా ఫ్రేమ్‌లను నిలువుగా బిగిస్తే (288 కుండీలతో).. చదరపు గజం స్థలంలోనే దాదాపు 9 అడుగుల ఎత్తులో ‘పెరటి మొక్కల పొద’ (వర్టికల్ గార్డెన్) తయారవుతుంది. గుండ్రంగా ఉండే ఈ ‘పెరటి మొక్కల పొద’ను అన్ని వైపుల నుంచి ఎండ తగిలే వీలున్న ఆరుబయటో, మేడ మీదో ఏర్పాటు చేసుకుంటే బావుంటుంది.

వాల్ గార్డెన్ సంగతి..
ఫ్రేమ్‌లను రెండు వరుసలుగా ప్లైవుడ్‌కు బిగిస్తే వాల్ గార్డెన్ సిద్ధం. ఉదయం గాని, మధ్యాహ్నం నుంచి గాని రోజుకు ఐదారు గంటలు ఎండ తగిలే చోట గోడకు ఆనించిన ప్లైవుడ్‌కు ఫ్రేమ్స్ బిగించి కుండీలు పెట్టుకుంటే చాలు. ఆకుకూరలు, కూరగాయల సాగుకు ఈ చిన్న కుండీలు భేషుగ్గా ఉంటాయనడంలో సందేహం లేదు.

విలక్షణమైన గ్రీన్‌వాల్
మరో విలక్షణ నమూనా వాల్ గార్డెన్‌ను కూడా ఈ కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. 16 మొక్కలు పెంచుకోవడానికి వీలుగా ఉండే ట్రే(మాడ్యూల్)లను తయారుచేసింది. 12.5 సెంటీమీటర్ల మందాన ఉండే ట్రేలో కొబ్బరి పొట్టు లేదా మట్టి, కంపోస్టు మిశ్రమం పోసి మొక్కలు పెట్టుకున్న తర్వాత.. దాన్ని గోడ పక్కన నిలబెట్ట వచ్చు. ఆకాశం వైపు చూడాల్సిన మొక్కలు... అడ్డంగా వంగి పక్కకు పొడుచుకొచ్చినట్టుంటాయి. ట్రేని అలాగే ఉంచి పై నుంచి లోపలికి నీరు పోయవచ్చు.
 ‘సాక్షి’ స్పెషల్ డెస్క్

చెత్తతో చక్కని కంపోస్టు


పలవునేరు మున్సిపాలిటీలో
వ్యర్థాలతో వినూత్న ప్రయోగం
కంపోస్టు తయారీతో
బహుళ ప్రయోజనాలు

సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించాలనుకునే వారికి కంపోస్టు చాలినంత అందుబాటులో లేకపోవడం ప్రతి పట్టణంలోనూ ఉన్న సమస్యే అనుకుంటుంటాం! అయితే, అటువంటి పట్టణాల జాబితా నుంచి చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణాన్ని మినహాయించి తీరాల్సిందే. ఎందుకంటే.. అక్కడ నాణ్యమైన కంపోస్టు బస్తాలకు బస్తాలు అమ్మకానికి సిద్ధంగా ఉంది!!

కాదేదీ కంపోస్టుకు అనర్హం అన్నట్టు.. 24 వార్డుల్లోని ఇళ్ల నుంచి అనుదినం సేకరిస్తున్న చెత్తతో.. చక్కగా కంపోస్టు తయారుచేస్తోంది పలవునేరు మున్సిపాలిటీ. మున్సిపాలిటీలలో రోజూ టన్నులకొద్దీ పోగుపడే చెత్తతో కంపోస్టు తయారుచేయాలంటూ పదేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చాలా మున్సిపాలిటీల్లో ఆ ఊసే ఇప్పటికీ లేదు. కొన్ని చోట్ల తూతూ మంత్రంగా జరుగుతోంది.

అయితే, ప్రత్యేక శ్రద్ధతో.. వ్యక్తిగత పర్యవేక్షణలో.. చెత్తతో కంపోస్టు తయారుచేయిస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు పలమనేరు మున్సిపల్ కమిషనర్ అన్నవరపు వెంకటేశ్వర్లు(99498 87727). ఫలితంగా పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితి మెరుగవడం, పర్యావరణ కాలుష్యం తగ్గడంతోపాటు..మున్సిపాలిటీ కి అదనపు ఆదాయం సమకూరుతోంది. అన్నిటికీ మించి.. విష రసాయనాలు లేకుండా పంటలు పండించుకోవడానికి ప్రజలకు కంపోస్టు అందుబాటులోకి వచ్చింది!

ఇదీ కంపోస్టు చేస్తున్న తీరు..
పలమనేరులో ప్రతి ఇంటి నుంచి రోజూ 21 మెట్రిక్ టన్నుల చెత్త వస్తుంది. ప్లాస్టిక్ తదితరాలు పోను.. 16 టన్నుల చెత్తను (ఏరోబిక్.. ఆక్సిజన్ తగిలే పద్ధతిలో) కంపోస్టు తయారీకి వినియోగిస్తున్నారు. ఆ చెత్తను యంత్రం సహాయంతో చిన్న ముక్కలుగా కత్తిరించి.. నేలపైనే కంపోస్టు దిబ్బలు వేస్తున్నారు. 10 అడుగుల పొడవు, 4 అడుగుల వెడ ల్పు, 5 అడుగుల ఎత్తులో కంపోస్టు దిబ్బలు వేస్తారు. ఇలా ప్రతి రోజూ 3 వేస్తున్నారు. దిబ్బల్లో తగినంత తేమ ఉండేలా చేసేందుకు మూడు రోజులకోసారి నీరు చల్లుతారు. నెలకోసారి ఈ దిబ్బలను తీసి.. పేడ నీళ్లు చల్లి తిరగేస్తే.. 90 రోజుల్లో కంపోస్టు సిద్ధమవుతోంది. దిబ్బను తిరగేయడానికి ముందు వారం రోజులు నీళ్లు చల్లకూడదు. ఒకటికి రెండుసార్లు జల్లించి.. చక్కని కంపోస్టును బస్తాల్లో నిల్వ చేస్తున్నారు.

ఇది కంపోస్టు యార్డు.. డంపింగ్ యార్డు కాదు!
ఈ కంపోస్టు అన్నివిధాలా నాణ్యంగా ఉందని తిరుపతిలోని వ్యవసాయ శాఖకు చెందిన లేబొరేటరీలో పరీక్ష చేయించగా తేలింది. దాదాపు ఏడాది క్రితం నుంచి నిబద్ధతతో కంపోస్టు తయారీ పని జరుగుతోంది. 2010 సెప్టెంబర్ నుంచి కంపోస్టు అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకూ 75 టన్నుల కంపోస్టు తయారవగా.. టన్ను రూ.2 వేలు చొప్పున పది టన్నులు రైతులకు అమ్మారు. ప్రస్తుతం రోజుకు 2 మెట్రిక్ టన్నుల సేంద్రియు ఎరువు పలమనేరు డంపింగ్... కాదు, కాదు.. కంపోస్టు యార్డులో తయూరవుతోంది! ఇప్పుడు అక్కడ 130 కంపోస్టు దిబ్బలున్నాయి. రోజూ వేసేదిబ్బలు వేస్తుంటే.. తీసే దిబ్బలు తీస్తున్నారు.

అడ్డదిడ్డంగా నిండిపోయి కుళ్లి కంపుకొట్టే డంపింగ్ యార్డు.. చక్కని కంపోస్టు యార్డుగా మారిపోయింది! అధికారుల్లో ప్రత్యేక శ్రద్ధ ఉండాలే గాని.. చెత్తనూ బంగారం చేయొచ్చనడానికి ఈ ప్రాంగణమే నిదర్శనం. చెత్త సేకరణ, తరలింపు, పది మంది కూలీలు... అన్ని ఖర్చులూ పోను ఈ యార్డు ద్వారా నెలకు రూ.40 వేలు ఆదాయం మున్సిపాలిటీకి లభిస్తోంది.

వర్మీ కంపోస్టు తయారుచేయడం కూడా ఇటీవల ప్రారంభమైంది. ఈ కంపోస్టుతో యార్డులోనే జామ, క్యాబేజీ, మిరప, టమాటా మొక్కలు సాగు చేస్తున్నారు. ఏపుగా పెరుగుతున్న మొక్కలను చూసి రైతులు కంపోస్టు వాడకం గురించి గ్రహిస్తున్నారు. అన్ని మున్సిపాలిటీలు, నగరాల్లో ఇదే మాది రిగా చెత్తపై అధికారులు శ్రద్ధపెడితే.. ఇక ‘ఇంటి పంట’లకే కాదు.. పొలాల్లో సేంద్రియ సాగుకు సైతం కంపోస్టు కొరత ఉంటుందా?
(శుక్ర, శనివారాల్లో ఇక్కడే కలుద్దాం)
- న్యూస్‌లైన్, పలవునేరు రూరల్(చిత్తూరు)

వ్యర్థాలతో కంపోస్టు.. ప్రయోజనాలెన్నో!

పలమనేరులో ప్రతి ఇంటి నుంచీ చెత్తను పూర్తిగా సేకరిస్తుండడంతో వ్యర్థాల రహిత పట్టణంగా మారింది. చెత్తను పారేయడానికి ఏడాదికి ఎకరం స్థలం అవసరమయ్యేది. ఇక స్థలాన్ని కొనుగోలు చేయూల్సిన అవసరం తప్పింది. రెగ్యులర్‌గా ఇలాగే చేస్తే... మరో వందేళ్ల వరకూ ఇప్పుడున్న 10 ఎకరాల యార్డే సరిపోతుంది. పర్యావరణం కలుషితమవకుండా కాపాడగలుగుతున్నాం. పైగా వుున్సిపాలిటీకి ఆదాయుం కూడా వస్తోంది. నర్సరీల వాళ్లు కొబ్బరిపొట్టు, మా కంపోస్టు వాడుతున్నారు.

రైతులు కూడా కంపోస్టు వాడకం వల్ల కలిగే మేలును స్వానుభవంతో గ్రహిస్తున్నారు. వ్యక్తిగత శ్రద్ధ ఉంటే తప్ప ఈ పని చేయించడం కష్టం. రోజూ యూర్డు వద్దకు వెళ్లి పర్యవేక్షిస్తున్నాను. సిబ్బంది, కార్మికులు బాగా సహకరిస్తున్నారు. ఇది అవుతుందా, పోతుందా అని చాలా వుంది నవ్వుకున్నారు. ఈ రోజు కంపోస్టు వాడుతున్న రైతుల ముఖంలో ఆనందం చూసి చాలా గ్రేట్‌గా ఫీలవుతున్నా.
- అన్నవరపు వెంకటేశ్వర్లు,
మున్సిపల్ కమిషనర్, పలమనేరు (చిత్తూరు)

నేడే ఉప్పల్‌లో ‘ఇంటి పంట’ వర్క్‌షాప్

‘ఇంటి పంట’ యజ్ఞంలో భాగంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం నిపుణుల తోడ్పాటుతో ఈనెల 19న (శనివారం) సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకూ ఉప్పల్ మెయిన్ రోడ్డులోని.. ‘సర్వే ఆఫ్ ఇండియా’ సంస్థ ఆవరణలో గల ఆడిటోరియంలో ‘ఇంటి పంట’ వర్క్‌షాప్ జరుగుతుంది.

స్టీవియా మొక్కలు, కొబ్బరి పొట్టుతో తయారుచేసిన సేంద్రియ ఎరువు, కుండీలు.. అందుబాటులో ఉంటాయి. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న వ్యవసాయ పరిశోధన సంస్థ(ఏఆర్‌ఐ)లోని కూరగాయల పరిశోధన విభాగం వారి కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు లభిస్తాయి. అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం.

పల్లె పచ్చని కూరగాయలు


పెరట్లో సేంద్రియ కూరగాయల పెంపకం...
ఇంటి ల్లిపాదికీ బాగు బాగు
తీగ జాతి కూరగాయల సాగుకు ఇదే అదను
ఆకుకూరలు, టమాటా, వంగ..
ఏ కాలంలోనైనా చక్కగా ఎదుగుతాయి
ప్రత్యేక మడుల్లో అధిక దిగుబడులు సాధ్యం

శీతాకాలం వెళ్లిపోతోంది. ఎండలు నెమ్మదిగా ముదురుతున్నాయి. సాధారణంగా గ్రామాల్లో ఇళ్ల దగ్గర కాస్తో కూస్తో పెరటి స్థలం ఉంటుంది. పెద్దగా ఖాళీ స్థలం లేకపోయినా ఐదూ పది గజాల స్థలమైనా ప్రతి ఇంటి ముందో, వెనుకో, పక్కనో ఉంటుంది. ఈ కాస్త జాగాలో ఏం పండిస్తాంలే అననుకోకుండా.. కాస్త మనసు పెట్టి సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, అనేక రకాల కూరగాయలు పెద్దగా ప్రయాస లేకుండానే పండించుకోవచ్చు.

రాబోయే రోజుల్లో ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని ఇంటిల్లిపాదీ తినడానికి ఈ రోజే పని ప్రారంభించడం ఉత్తమం. ఒకవైపు కూరగాయల్లో విష రసాయనాల అవశేషాలు, మరోవైపు అంతకంతకూ పెరుగుతున్న ధరలు... ఏ విధంగా చూసుకున్నా.. ఉన్నంత స్థలంలో కొన్ని రకాలైనా ఇంటి పట్టున పండించుకోవడం ఉత్తమం కదండీ....!

పశువుల నుంచి రక్షణ అవసరం
గ్రామాల్లో ఇళ్ల దగ్గర ఎంతో కొంత ఖాళీ స్థలం ఉంటుంది. కానీ, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పశువులు మొక్కల్ని బతకనివ్వవు. ప్రహరీ లోపలైతే ఫర్వాలేదు. కనీసం ముళ్ల కంచె అయినా గట్టిగా కట్టుకొని మొక్కలు పెంచడానికి శ్రీరారం చుట్టాలి. పల్లెల్లో మొక్కలకు పశువులే కాదు.. కోళ్ల బెడద కూడా ఎక్కువే. ఇతరులవే కాదు మనకూ కోళ్లుంటాయి. వాటిని తిరగకుండా కట్టడి చేసుకుంటే తప్ప మొక్కలు ఎక్కిరావు.
ప్రణాళికతో ఏడాది పొడవునా పెరటి కూరగాయలు
అన్ని కూరగాయలు, ఆకుకూరలూ ఒకే రోజు విత్తుకోకూడదు. ఇప్పుడు గుప్పెడు గింజలు, వారం పది రోజులు గడిచాక మరికొన్ని గింజలు.. అలా విడతల వారీగా చల్లుకోవాలి. ప్రతి వారం ఆకుకూరలు, కూరగాయలు అందుబాటులో ఉంచుకోవాలంటే ఇలాంటి ఉపాయం అవసరమే. ఈ విధంగా ఏడాది పొడవునా పుష్కలంగా ఆకుకూరలతోపాటు కూరగాయలు కూడా ప్రణాళిక ప్రకారం పెంచుకోవచ్చు.

ఏ ఏ రకాల సాగుకు తగిన సీజన్ ఇది?
ఆకుకూరలకు ప్రత్యేకంగా సీజన్ అంటూ ఏమీ లేదు. ఎప్పుడైనా చక్కగా పెరుగుతాయి. పాలకూర, చుక్కకూర.. తదితర ఆకుకూరలు మూడు, నాలుగు వారాల్లో కోతకు వస్తాయి. మొక్కలను కత్తిరిస్తే మళ్లీ పిలకలు వేస్తాయి. కత్తిరించిన తర్వాత మట్టిని గుల్ల చేసి చారెడు కంపోస్టు చల్లి నీరుపోస్తే చాలు. పిలకలు పెరిగాక కోసుకొని.. మళ్లీ విత్తనాలు చల్లుకోవాలి. మెంతి మొక్కల్ని మూడుసార్ల వరకూ కత్తిరించుకోవచ్చు. గోంగూర మొక్క నుంచి ఆకుల్ని కోసుకోవాలి. పూత, పిందె వచ్చేంత కోసుకుంటూ ఉండొచ్చు. మొక్క బచ్చలి మాత్రం 45 రోజులకు కోతకు వస్తుంది.

పందిళ్లతో అధిక దిగుబడులు
పెరటి తోటల్లో తీగజాతి మొక్కల పెంపకానికి ఇది చక్కటి సీజన్. బీర, పొట్ల, కాకర, దోస తీగలను చక్కగా పందిళ్లు వేసి పండిస్తే అధిక దిగుబడి వస్తుంది. భారీగా పందిళ్లు అక్కర్లేదు. ఇంట్లో వాళ్లే తీరిక ఉన్నప్పుడు నాలుగు పురికొసలో, ఇనుప తీగలో కట్టి వాటిపైకి మొక్కల్ని పాకిస్తే చాలు. కొంచెం ఆసరా ఇస్తే చాలు. ఇంటి మీదకో, పందిరి మీదకో అల్లుకొని చక్కని దిగుబడినిస్తాయి. తీగ బచ్చలి వేసుకుంటే ఏడాది పొడవునా ఆకుకూర అందుబాటులో ఉంటుంది. దొండ పాదు నాటుకుంటే మూడేళ్ల వరకూ దిగుబడి ఇస్తూనే ఉంటుంది.

బెండకూ ఈ సీజన్ భేష్
బెండ సాగుకూ ఇది మంచి సీజన్. రెండు నెలల్లో కాపుకొస్తుంది. ఒకటిన్నర నెలలు కాస్తుంది. ఇంట్లో ఎందరు ఉంటారనే దాన్ని బట్టి ఎన్ని మొక్కలు వేసుకోవాలో చూసుకోవాలి. గోరుచిక్కుడు, మొక్కజొన్న.. టమాటా, వంగ వంటి పంటల గురించి ఇక చెప్పనక్కర్లేదు. బీర విత్తనం నాటిన నెలన్నర, రెండు నెలల్లో కాయలు కోతకు వస్తాయి.

పొట్ల తీగను పందిరిపైకి పాకిస్తే మంచి దిగుబడి వస్తుంది. కాయలు వంకరైపోకుండా రాయి కట్టాలి. వంగ మూడు నెలల్లో కాపుకొస్తుంది. 6 నెలల వరకూ కాపు ఉంటుంది. తర్వాత చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి.. కొంచెం కంపోస్టు వేస్తే.. మళ్లీ ఏపుగా పెరిగి కాపుకొస్తుంది. ఏడాదికిపైగా వంకాయలకు ఢోకా ఉండదు. వంగకే పురుగుల బెడద ఎక్కువ. ఏ రెమ్మకు తెగులు వచ్చినా అక్కడికి తుంచేసి నాశనం చేయడం అవసరం. టమాటా మొక్క వేసిన 2 నెలల్లో కాపుకొస్తుంది. రెండు నెలల పాటు కాయలు ఇస్తుంది.

సేంద్రియ ఆహారమే ఆరోగ్యం
రసాయనాలు వాడకుండా పెంచుకున్న కూరగాయలు, ఆకుకూరలే ఆరోగ్యం, కమ్మటి రుచి కూడా. ఖాళీ ఉంది కదా అని గొయ్యి తీసి ఆ మట్టి ఎలా ఉన్నా విత్తనం వేస్తే సరిగ్గా పెరగకపోవచ్చు. అందుకే... మట్టి, పశువుల ఎరువు, వర్మి కంపోస్టు లేదా ఇంటి వద్ద తయారుచేసుకున్న ఆకుల ఎరువు(లీఫీ మౌల్డ్) కలిపి ప్రత్యేకంగా సిద్ధంచేసుకున్న మిశ్రమం వాడితే ఫలితం బావుంటుంది. ఈ మట్టి మిశ్రమంతో ప్రత్యేకంగామడులను తయారుచేసుకొని కూరగాయలు, ఆకుకూరలు పెంచుకుంటే మామూలుగా కన్నా 3 నుంచి 5 రెట్లు అధిక దిగుబడి వస్తుందని నిపుణులు చెప్తున్నారు.

ఎరమ్రట్టి వాడితే ఇసుక కలపనక్కర్లేదు
కొన్ని ప్రాంతాల్లో నల్లమట్టి, మరికొన్ని ప్రాంతాల్లో ఎరమ్రట్టి ఉంటుంది. నల్లమట్టికి త్వరగా గట్టిపడి పిడచకట్టుకుపోయే స్వభావం ఉంది. దీనివల్ల మొక్కలు బాగా పెరగవు. అందుకని ఎరమ్రట్టి వాడితే మంచిది. నల్లమట్టే వాడాల్సి వస్తే కంపోస్టు, పశువుల ఎరువు వంటి వాటితోపాటు ఇసుకను కూడా కలపడం మంచిది. ఎరమ్రట్టి రెండుపాళ్లలో మిగతా సేంద్రియ ఎరువులు ఒక్కోపాళ్లలో కలిపి మొక్కలు పెంచొచ్చు. నల్లమట్టి అయితే ఒక పాలు కలిపితే మంచిది.
వర్మీ కంపోస్టు, పశువుల ఎరువు తగినంత దొరక్కపోతే మట్టి, కంపోస్టు సమపాళ్లలో వేసుకోవచ్చు. ఇంకా కావాలంటే... 65 శాతం మట్టి, మిగతా భాగం సేంద్రియ ఎరువులు కలిపి వాడొచ్చు. వేప పిండి, కానుగ పిండి, ఆముదం పిండి, మాగిన కొబ్బరి పొట్టు సాధ్యమైనంత కలుపుకుంటే మొక్కలను చీడపీడలు అంతగా ఆశించకుండా ఉంటాయి. ఇవి మొక్కలకు బలం కూడా. కొబ్బరి పొట్టు వల్ల వేళ్లు అధికంగా ఏర్పడడానికి వీలవుతుంది. మట్టిలో తేమ త్వరగా ఆరిపోకుండా కొబ్బరి పొట్టు చూస్తుంది. మట్టిని పక్కన పెట్టి కేవలం ఆకుల ఎరువు లేదా శుద్ధిచేసిన కొబ్బరి పొట్టునే వాడుతూ కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. మట్టిలోకన్నా అనేక రెట్లు ఎక్కువ దిగుబడి తీస్తున్నారు కూడా.

ప్రత్యేక మడులు...
ఇటుకలు మూడు వరుసలు పేర్చి లేదా చెక్క ముక్కలు చుట్టూ కట్టి మధ్యలో మట్టి మిశ్రమం పోసి ప్రత్యేక మడిని సిద్ధం చేయొచ్చు. అడుగున ఇటుకలు పరిచి.. దాని పైన కొంచెం మట్టి పోసి.. అక్కడక్కడా బెజ్జాలు(ఎక్కువైన నీరు కిందికి పోవడానికి) పెట్టిన పాలిథిన్ షీట్ పరిచి.. ఆపైన ఇటుకలు మూడు వరుసలు పేర్చి మట్టి మిశ్రమం పోస్తే.. పెరటి స్థలంలో ప్రత్యేక మడి సిద్ధమైనట్టే. వర్షం పడినా మడి కింద నేల చెదిరిపోకుండా ఉండడానికి, కలుపు పెద్దగా రాకుండా ఉండడానికి ఇలా చేస్తున్నారు.

ఆకుల రసాలు, కషాయాలతో చీడపీడలకు చెక్
కూరగాయ మొక్కలు, ఆకుకూరలకు చీడపీడలు రాకుండా, ఏవైనా పురుగు సోకినా.. ఆకుల రసాలనో, కషాయాలనో వాడొచ్చు. వేప నూనెను సైతం వాడొచ్చనిహైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని అగ్రికల్చర్, హార్టికల్చరల్ సొసైటీ అధ్యక్షుడు, ఉద్యాన శాఖలో అదనపు సంచాలకునిగా రిటైరైన మిద్దెల అనంతరెడ్డి ‘ఇంటి పంట’తో చెప్పారు. ఈ కషాయాలను ఎవరికి వారు ఇంటి దగ్గరే తయారుచేసుకోవచ్చని తెలిపారు. వేప ఆకులు, శీతాఫల ఆకులు, వావిలి ఆకులను మెత్తగా నూరి, రసం తీసి, వడపోసిన తర్వాత.. అంతకు 20 రెట్లు నీటిలో కలిపి పెరటి మొక్కలపై చల్లుకోవచ్చన్నారు. ఈ ఆకులను ఉడకబెట్టి కషాయాన్నయినా చల్లవచ్చన్నారు. ఈ ఆకుల వాసన ఘాటుగా ఉంటుంది. రసం తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త పడితే చాలు. వేపకాయల రసం కూడా వాడొచ్చన్నారు. పచ్చిమిరప కాయలను గాని లేదా వెల్లుల్లిని గాని దంచి... కిరోసిన్‌లో ఒక రాత్రి నానబెట్టి తర్వాత నీటిలో కలిపి మొక్కలపై చల్లవచ్చన్నారు. చీడపీడలు ఆశించక ముందే 15 రోజులకోసారి వీటిని చల్లవచ్చని అంటూ.. పురుగుల గుడ్లు ఉన్నా నశిస్తాయన్నారు. ఈ రసాల వాసనకు చీడపీడలు పెరటి తోటల దరిదాపులకు కూడా రావన్నారు.
(శుక్ర, శనివారాల్లో ఇక్కడే కలుద్దాం)
- ‘సాక్షి’ స్పెషల్ డెస్క్

సంప్రదించవచ్చు..
ఉద్యాన శాఖలో అదనపు సంచాలకునిగా రిటైరైన మిద్దెల అనంతరెడ్డికి పెరటి తోటలు, పండ్ల తోటల సాగులో మంచి అనుభవం ఉంది. 57 ఏళ్లుగా ఉచిత సేవలందిస్తున్న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని ‘అగ్రికల్చర్, హార్టికల్చరల్ సొసైటీ’తో ఆయనకు ముప్పయ్యేళ్లుగా అనుబంధం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఉద్యాన మిషన్‌కు అనుబంధంగా ఉన్న సాంకేతిక సలహా బృందం(టీఎస్‌జీ)లో ఆయన సభ్యులు. పట్నమైనా పల్లెలైనా ఇంటి పట్టున కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే వారు సందేహాలేమైనా ఉంటే 92461 08262 నంబరులో ఆయనను సంప్రదించవచ్చు.