డిప్యూటీ డెరైక్టర్ వెంకట్ రామ్‌రెడ్డి వెల్లడి ఉద్యాన పంటల సాగులో రెండేళ్ల డిప్లొమా పూర్తిచేసి ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వందలాది మందికి ఇది శుభవార్త. ‘సాక్షి’ దినపత్రిక ప్రారంభించిన ‘ఇంటి పంట’ యజ్ఞానికి లభిస్తున్న విశేష ప్రజాదరణ.. సరికొత్త ఉపాధి అవకాశాలకు ద్వారాలు తెరుస్తోంది. ‘ఇంటి పంట’లపై నగరాలు, పట్టణప్రాంత వాసుల్లో వ్యక్తమవుతున్న అమిత ఆసక్తి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యాన శాఖను ఆలోచింపజేసింది. రాష్ట్రంలో ప్రతి ఏటా 400 మంది యువతీయువకులు రెండేళ్ల ‘హార్టికల్చర్ డిప్లొమా’ పూర్తిచేస్తున్నారు. వీరిలో చాలా మంది ఉద్యోగాల వేటలోనే కాలం గడిపేస్తున్నారు. ఈ డిప్లొమా హోల్డర్లకు సాక్షి ‘ఇంటి పంట’ వెలుగులో సరికొత్త ఉపాధి మార్గం చూపాలని భావిస్తున్నామని ఉద్యాన శాఖ డిప్యూటీ డెరైక్టర్ (పబ్లిక్ గార్డెన్స్) ఎల్. వెంకట్ రామ్‌రెడ్డి వెల్లడించారు.అభ్యర్థులకు హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో 15 రోజుల పాటు శిక్షణనిస్తారు. పట్టణాలు, నగరాల్లో ఇళ్ల వద్ద, మేడలపైన సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలు పెంచడం.. పార్కుల్లో రాలిన ఆకులు, ఇతరత్రా వ్యర్థాలతో కంపోస్టు (ఆకు ఎరువు) తయారుచేయడం.. తదితర అంశాలపై ఇంటెన్సివ్ శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. శిక్షణ పూర్తయిన తర్వాత వీరు స్వయంగా అపార్ట్మెంట్లలో, ఇళ్ల వద్ద, ఇళ్లపైన మడులు, కుండీల్లో కూరగాయల పెంపకానికి సంబంధించిన యాక్షన్ టీమ్‌లుగా ఏర్పడతారు. ‘ఇంటి పంట’లపై ఆసక్తి ఉండి, తగిన తీరిక లేదని భావించే పట్టణ ప్రాంత వాసులు ఈ యాక్షన్ టీమ్‌లకు సర్వీస్ చార్జీ చెల్లించి.. తమ ఇళ్ల వద్ద మడులు, కుండీలను ఏర్పాటు చేయించుకోవచ్చు. తదనంతర యాజమాన్య సేవలు, కంపోస్టు తదితరాలను కూడా వీరి ద్వారా పొందడానికి వీలవుతుంది. అంటే ఇంటిపట్టున ఆకుకూరలు, కూరగాయల సాగుకు అవసరమైన ఇన్పుట్స్ అందుబాటులో లేవన్న ఇబ్బంది పట్టణప్రాంతవాసులకు తొలగిపోతుందన్న మాట. ఈ సరికొత్త ఉపాధి మార్గంపై ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని హార్టికల్చర్ డిప్లొమా హోల్డర్లు డిప్యూటీ డెరైక్టర్ వెంకట్ రామ్‌రెడ్డిని (94904 90270, 040- 23234091) సంప్రదించవచ్చు. పబ్లిక్ గార్డెన్స్ నర్సరీలో ‘ఆకు ఎరువు’ తయారీ ఆకుల వ్యర్థాలతో చక్కని సేంద్రియ ఎరువును తయారుచేసుకోవడం గురించి సాక్షి ‘ఇంటి పంట’లో అచ్చయిన కథనానికి వెంకట్ రామ్‌రెడ్డి స్పందించారు. ఇన్నాళ్లూ వృథాగా లారీలకు ఎత్తి ఊరుబయటకు తీసుకెళ్లి పారబోయడమో, లేక తగులబెట్టడమో చేస్తున్న ‘ఆకు చెత్త’తో భూసారాన్ని పెంచి మొక్కలకు, పర్యావరణానికి మేలుచేసే ‘ఆకు ఎరువు’ తయారుచేయవచ్చన్న విషయం ఆయనను కొత్త పనికి పురికొల్పింది. సేంద్రియ రైతు, స్క్వేర్ఫుట్ గార్డెనింగ్ నిపుణుడు దేవినేని మధుసూదనరావు కూరగాయలు, ఆకుకూరలు సాగుచేస్తున్న తీరుపై ‘..అంతా ఆకు ఎరువుతోనే’ శీర్షికతో ‘ఇంటి పంట’లో వచ్చిన కథనం వెంకట్ రామ్రెడ్డిలో కంపోస్టు తయారీపై ఆసక్తిని రేకెత్తించింది. అదేరోజు మధుసూదనరావుకు ఫోన్ చేసి ‘ఆకు ఎరువు’ గురించి వాకబు చేశారు. ఎండు ఆకులన్నిటినీ పారేయకుండా భద్రంగా కుప్పగా వేయమని సిబ్బందిని ఆదేశించారు(ఈ ఆదేశాన్ని అమలు చేయించడానికి మెమోలు ఇవ్వాల్సివచ్చిందట!). మధుసూదనరావు సమక్షంలో.. ఈ నెల 8వ తేదీన ‘ఆకు ఎరువు’ తయారీ కోసం పద్ధతి ప్రకారం దిబ్బను వేయించారు. ఇంత సులువుగా.. వాన పాములు కూడా అవసరం లేకుండా చక్కని ఆకు ఎరువు తయారుచేసుకోవచ్చని అర్థంచేసుకున్న ఉద్యాన శాఖ అధికారులు, సిబ్బందిలో ఉత్సాహం ఉరకలు వేసింది. మూడు వారాలకోసారి.. రెండుసార్లు.. ఈ దిబ్బను తిరగేస్తే.. 90 రోజుల్లో చక్కని ఆకు ఎరువు తయారవుతుందని మధుసూదనరావు చెప్పారు. రోజుకు 200 కిలోల ఆకు ఎరువు హైదరాబాద్ మహానగరంలో పబ్లిక్ గార్డెన్స్, మంత్రులు, జడ్జీల క్వార్టర్లు తమ పరిధిలో ఉన్నాయని, ఇందులో రోజూ టన్ను ఎండు, పచ్చి ఆకులతో కూడిన చెత్త వస్తుందని వెంకట్ రామ్‌రెడ్డి ‘ఇంటి పంట’ ప్రతినిధికి తెలిపారు. ఈ చెత్తను ఇక మీదట పారేసేది లేదని, దీనితో రోజుకు 200 కిలోల ఆకు ఎరువును తయారుచేసుకుంటామని ఆయన వివరించారు. తాము ఏడాదికి రూ. 4, 5 లక్షల ఖరీదైన పశువుల ఎరువు, రసాయనిక ఎరువులు కొనుగోలు చేసేవారమని, ఇకపై తామే వ్యర్థ ఆకులతో సేంద్రియ ఎరువు స్వయంగా తయారుచేసుకుంటామని ఆయన చిరునవ్వుతో చెప్పారు. అంతేకాదు.. చెత్తను ఊరవతల పారేయడానికి అయ్యే ఖర్చు కూడా ఆదా అయినట్టే కదా! వెంకట్ రామ్‌రెడ్డి విజ్ఞతతో చూపిన చొరవ.. ఉద్యాన శాఖ పరిధిలో చెత్త నుంచి సేంద్రియ ఎరువు తయారీకి శుభారంభం పలకడం ప్రశంసనీయం. విప్లవాత్మక మార్పునకు ఇది గొప్ప ప్రారంభం. రాష్ట్రంలోని అన్ని పార్కుల్లోనూ ఇలాంటి ప్రయత్నం జరిగితే.. ఏకంగా కంపోస్టు విప్లవమే వస్తుందనడంలో అతిశయోక్తి ఏమైనా ఉందా..? ‘సాక్షి’ స్పెషల్ |
Monday, 21 March 2011
‘ఇంటి పంట’ల కోసం యాక్షన్ టీమ్‌లు
Subscribe to:
Post Comments (Atom)
ఉద్యాన పంటల సాగులో రెండేళ్ల డిప్లొమా పూర్తిచేసి ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వందలాది మందికి ఇది శుభవార్త. ‘సాక్షి’ దినపత్రిక ప్రారంభించిన ‘ఇంటి పంట’ యజ్ఞానికి లభిస్తున్న విశేష ప్రజాదరణ.. సరికొత్త ఉపాధి అవకాశాలకు ద్వారాలు తెరుస్తోంది. ‘ఇంటి పంట’లపై నగరాలు, పట్టణప్రాంత వాసుల్లో వ్యక్తమవుతున్న అమిత ఆసక్తి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యాన శాఖను ఆలోచింపజేసింది. రాష్ట్రంలో ప్రతి ఏటా 400 మంది యువతీయువకులు రెండేళ్ల ‘హార్టికల్చర్ డిప్లొమా’ పూర్తిచేస్తున్నారు. వీరిలో చాలా మంది ఉద్యోగాల వేటలోనే కాలం గడిపేస్తున్నారు. ఈ డిప్లొమా హోల్డర్లకు సాక్షి ‘ఇంటి పంట’ వెలుగులో సరికొత్త ఉపాధి మార్గం చూపాలని భావిస్తున్నామని ఉద్యాన శాఖ డిప్యూటీ డెరైక్టర్ (పబ్లిక్ గార్డెన్స్) ఎల్. వెంకట్ రామ్‌రెడ్డి వెల్లడించారు.
No comments:
Post a Comment